డీజే లతో బ్యాండ్ కార్మికుల బతుకులు చిద్రం

 

-ప్రభుత్వం డిజె లను నిషేధించాలి

-బ్యాండ్ కళాకారుల సంఘం డిమాండ్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఏప్రిల్ 25:

సాంకేతికత పెరిగిపోతున్న ఈ కాలంలో శుభకార్యాలైన ఫంక్షన్లో సభలు సమావేశాల్లో డప్పులు మంగళ వాయిద్యాలు బ్యాండ్ బృందాల అవసరం లేకుండా ఈవెంట్ ఆర్గనైజర్లు అతి శక్తివంతమైన డీజేలను ఉపయోగిస్తూ బ్యాండ్ కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని మందమర్రి బ్యాండ్ కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మందమర్రి ప్రెస్ క్లబ్ లో బ్యాండ్ కార్మికులు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శుభకార్యాలకు ఫంక్షన్లకు ఈవెంట్ ఆర్గనైజర్ లను ఆశ్రయించడంతో వారు నిర్వాహకులను ఆకర్షించడానికి పవర్ఫుల్ టూ పిన్ ఫోర్ పిన్ డీజే లను వాడుతూ శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారని డీజేలో మ్యూజిక్ మోజులో డాన్సులు చేస్తూ యువకులు ఎందరో గుండెపోటుతో మరణించడం కూడా జరుగుతుందన్నారు. ఈ డీజేల ఉపయోగంతో బ్యాండ్ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఉపాధి లేకపోవడంతో తీసుకువచ్చిన అప్పులను తీర్చలేక కుటుంబాన్ని పోషించలేక మానసికంగా కృంగిపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మందమర్రి ఏరియా బ్యాండ్ కార్మికులమందరం ఒక అసోసియేషన్ గా ఏర్పడినామని మా హక్కులు సాధించడానికి పోరాటం చేస్తామని అన్నారు . డీజే లను ప్రభుత్వ అధికారులు నిషేధించాలని పర్మిషన్ ఇవ్వరాదని మేము అందరం కలిసి అధికారులను ప్రజాప్రతినిధులను మీడియా వారిని వేడుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజికల్ బ్యాండ్ మందమర్రి అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తాజుద్దీన్ బాబా, కోశాధికారి ఎండి అక్బర్ బాషా, ఎండి సలాం సహాయ కార్యదర్శి వినోద్, సాయి కృష్ణ, చోటు మియా, పడగల అఖిల్, ఎండి సుకూర్, ఎండి అబ్జల్, శశిధర్, దుర్గం శ్రీనివాస్, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking