ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఏప్రిల్ 25
మందమర్రి మార్కెట్ మజీదే అసరా మసీదు లో శుక్రవారం నమాజ్ అనంతరం కాశ్మీర్లో ఫైల్గాంలో జరిగినటువంటి దమన కాండని నిరసిస్తూ ఉగ్రవాదులను పట్టుకొని శిక్షించాలని కోరుతూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పిలుపుమేరకు ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో ముస్లింలు కలసి నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటనలు పునావృతం కావద్దని ముక్తకంఠంతో ఖండించారు. అనంతరం మృతులకు నివాళులు అర్పించారు. మసీద్ ఇమామ్ అజామ్ అలీ, మసీద్ ప్రెసిడెంట్ గులాం మూహిద్దీన్, నిజాం అజారుద్దీన్ జుబేర్, కలీం, సుల్తాన్ మజార్, సలావుద్దీన్, షఫీ చాంద్ పాషా, సమీర్, తాజ్, హఫీజ్, కబీరుద్దీన్ ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.