రాష్ట్ర బీసీ న్యాయవాదుల సదస్సుపోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్ ఏప్రిల్ 22 : సామాజిక న్యాయసాధనకై ఈనెల 30న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన బిసి న్యాయవాదుల సదస్సు నుజయప్రదం చేయాలని రాజ్యసభ సబ్యులు సీనియర్ అడ్వకేట్ ఆర్. కృష్ణయ్య పిలుపు నిచ్చారు.ఈ మేరకు శుక్రవారం కాచిగూడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ సామాజిక న్యాయసాధనకై బిసి అడ్వకేట్ చేస్తున్న పోరాటాలు అనివార్యమన్నారు. సామాజిక న్యాయసాధనకై పోరాటం చేస్తున్న న్యాయవాదులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత స్థానం కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.హైకోర్టు,సుప్రీంకోర్టు జడ్జిల నియమకాలలో బిసి/ఎస్సి/ఎస్టి లకు జనాభా ప్రకారం రిజర్వేషన్ కోటా ప్రవేశపెట్టాలని, అలాగే జూనియర్ బిసి అడ్వకేట్ కు నెలకు 20 వేల స్టైఫండ్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చాలిచాలని సంపాదనతో జీవితాలను వెల్ల దీసే ప్రతి అడ్వకేట్ కు 250 గజాల ప్రభుత్వ స్థలం, ఇళ్ళ పట్టాలు మంజూరు చేయాలని కోరారు. అడ్వకేట్స్ అందరికీ, కుటుంబ సభ్యులతో ఇన్సూరెన్స్ వర్తింప చేయాలని కోరారు. ఇటీవల తెలంగాణా రాష్ట్రము లో న్యాయవాదుల పై దాడులు,హత్యలు పెరిగి పోతున్నయని కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేసారు.బయట దాడులతో పాటి ఏకంగా కోర్ట్ ఆవరనలోనే లాయర్లపై దాడులు జరుగటం శోచనీయమన్నారు.చట్టం ఉన్నత వర్గాలకు చుట్తంగా మారిందని ఆరోపించారు.న్యాయవ్యవత్సకు స్వయం ప్రతిపత్తి ఉన్నపుడే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. గతం తో పోల్చితే నేటి రాజకీయాలు బ్రస్టు పట్టి పోయాయన్నారు.రౌడీలు,గుండాలు,భూకబ్జా దారులు,రియలేస్టేట్ మాఫియా రాజ్యమేలుతుందని,వీరిని అరికట్టాలంటే మేధావులు, లాయర్లు రాజకీయాల్లోకి రావాలని కృష్ణయ్య పిలుపు నిచ్చారుస్టేషన్ బేల్ ల మూలంగా హత్యలు, దోపిడిలు, గుడాలు యదేచ్చగా గంటలో బయటికి వస్తున్నారని,వెంటనే స్టేషన్ బేల్ వ్యవస్తను రద్దు చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేసారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారం పార్లమెంట్లో చర్చిస్తానని తెలిపారు. అనంతరం ప్రదాన కార్యదర్శి బత్తులకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా తెలంగాణలో కూడా రాయితీలు కల్పించాలని కోరారు. డాక్టర్స్ మాదిరిగా లాయర్లకు కుడా రక్షణ చట్టం తీసుక రావాలని డిమాండ్ చేసారు..ఈ నెల 30న జరిగే మహా సభకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టులలో ప్రాక్టీస్ చేసె బిసి అడ్వకేట్స్ పాల్గొనాలని కృష్ణయ్య పిలుపు నిచ్చారు. ఈ సందర్బంగా30న జరిగే మహా సభ పోస్టర్ ను తెలంగాణా బిసి న్యాయవాదుల సంఘం అద్యక్షులు నాగుల శ్రీనివాస్ యాదవ్,ప్రదాన కార్యదర్శి బత్తులకృష్ణ, నాగేశ్వరరావు, సంఘమేశ్వర్,పిట్టల మనోహర్ తదితరులు పాల్గొన్నారు .