_దళితబందు కేసీఆర్ ఆత్మబందువు
_ తప్పులు చేస్తే ఎంతటివారైనా కేసీఆర్ క్షమించడు
ఉనికి కోసమే జీవన్ రెడ్డి ఆరాటం
మీ కాంగ్రెస్ పాలనలో దళితులు కేవలం ఓటర్లే
చొప్పదండి ఎమ్మేల్యే సుంకే రవి శంకర్
జగిత్యాల ప్రతినిధి, ఏప్రిల్ 28:(ప్రజా బలం) దళితబందు పతకం కేసీఆర్ ఒక విజన్ తో దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేపట్టిన పతక మని ఇందులో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని ఏనాడో చెప్పాడని, జీవన్ రెడ్డి కేవలం తన రాజకీయ ఉనికి కపఫుకోవడానికే నిరాదార ఆరోపణలు చేస్తున్నాడని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ అన్నారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రవి శంకర్ మాట్లాడారు. దళితుల జీవితాల్లో వెలుగులు నిపాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పతకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ పతకం అమలు దశలోనే ఎవరు అవినీతికి పాల్పడినా సహించనని కేసీఆర్ హెచ్చరించారన్నారు. అందుకు మద్దతుగా ఎమ్మెల్యే లందరము ఒప్పుకొని తప్పుచేస్తే శిక్షించమని చెప్పామని రవి శంకర్ అన్నారు. కేసీఆర్ ఎవరు తప్పు చేసినా ఉపేక్షించడని అందుకు ఉదాహరణగా బొడిగే శోభ, బాబు మోహన్ల పేర్లను వెల్లడించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దళిత జాతిని అవమానపరుస్తున్నారంటూ, వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ బీఆర్ ఎస్ పై ఆరోపణలు చేశారని అన్నారు. 60 ఏండ్ల కాలంలో దళిత జాతికి మీ కాంగ్రెస్ పార్టీ చేసిందేమిటి చెప్పాలని రవి శంకర్ ప్రశ్నించారు. ఈ తొమ్మిదేండ్లలో దళితులకు ఏమి చేశామో గళ్ళ ఎగరేసుకొని చెప్తామని రవి శంకర్ అన్నారు. దళిత జాతి ఆత్మగౌరవాన్ని ఆకాశానికి ఎత్తిన ఘనత బీఆర్ ఎస్ పార్టీది కేసీఆర్ దని కొనియాడారు. దేశంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని హైద్రాబాద్ లో ఏర్పాటు చేశామని అన్నారు. అంబెడ్కర్ గౌరవాన్ని మీరు ఎక్కడ పెట్టారో ప్రజలందరికీ తెలుసన్నారు. మీ పాలనలో ఎస్సి కార్పొరేషన్ రుణాలు పొందాలంటే దళితులు బ్యాంకర్ల చుట్టూ చెప్పులరిగెల తిరిగినా అవి దక్కేవి కావన్నారు. మీ కాంగ్రెస్ పాలనలో అవినీతి అక్రమాలు లేకుండా ఏ పథకమైన అమలైందా చెప్పాలని జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే రవి శంకర్ ప్రశ్నించారు. బీఆర్ ఎస్ అందిస్తున్న ప్రతి పథకానికి సంబంధించి పారదర్శకంగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే రవి శంకర్ అన్నారు. నయా పైసా ఖర్చు లేకుండా మధ్య వర్తుల లేకుండా అర్హులకు అందిస్తున్నామన్నారు. దళితుల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు తేవాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విదంగా దళిత బంధు పతకాన్ని సీఎం కేసీఆర్ అమలుచేస్తున్నారన్నారు. జీవన్ రెడ్డి మాట్లాడేముందు కొంచమైన ఆలోచన చేసివుండాలని రవి శంకర్ అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాము, సచివాలయానికి అంబేద్కర్ పేరుతోపాటు పరిపాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దన్నారు. మీ పాలనలో ఎడారిగా మారిన రాష్ట్రాన్ని తెలంగాణ ప్రభుత్వం సస్యశ్యామలం చేసిందన్నారు. సాగు నీటి కష్టాలు మీ పాలనలో అనేకమని వానమ్మ వానమ్మ అని ప్రజలు రైతులు పడుకున్న విషయాన్ని జీవన్ మరిచిపోయాడన్నారు. మీ పార్టీ గల్లీలో లేదు ఢిల్లీలో లేదు దేనికోసం జీవన్ రెడ్డి ఇష్టారాజ్యంగా అసత్య ఆరోపణలు చేస్తున్నాడో అర్థము కావడం లేదన్నారు. మీరెన్ని చేసినా తిరిగి రానున్నది బీఆర్ ఎస్ ప్రభుత్వమని వంద సీట్లతో అధికారంలోకి వస్తామని రవి శంకర్ చెప్పారు. దళిత బందులో అవినీతి జరిగితే సహించమని నేరుగా ఎమ్మెల్యేలను బాద్యులను చేస్తామని సీఎం ఎప్పుడో చెప్పి టిక్కెట్లు ఇవ్వమని హెచ్చరించారని రవి శంకర్ చెప్పారు. మీ కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిని చూసే నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బులు వేస్తున్నారన్నారు. మీ కాంగ్రెస్ పాలనలో దళితులను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తే మేము వారి అభివృద్ధి, సంక్షేమం కోసం తపన పడుతున్నామని ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. సీఎం కేసీఆర్ మాటలను వక్రీకరించి మాట్లాడడం జీవన్ రెడ్డికి భావ్యం కాదని వయసు మీదపడి అన్ని నెరిసి మాట్లాడే మాటలన్నారు. దళిత బందులో అవినీతి జరిగితే నిరూపించాలి తప్ప మాటలను వక్రీకరించి మాట్లాడడం సమంజసం కాదన్నారు. పేదలను ఉన్నతంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నినాదం గరిబి హఠావో అని మాలాగా 2 లక్షల 70 వేల ఇండ్లను ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇండ్లు నిర్మించుకునేందుకు స్థలం ఉంటే 3 లక్షలు ఇస్తామని, రాష్ట్రంలో ఉద్యోగులకు ఇస్తున్న జీతాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. బిజెపి రాష్ట్రాల్లో, మీ కాంగ్రెస్ పాలనలో దళితుల మీద జరిగిన దాడులను మరిచిపోయారా అని ప్రశ్నంచారు. మీ మాటలు, మీ కాంగ్రెస్ నాయకుల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి ఇప్పుడు లెవని, తెలంగాణలో అమలవుతున్న పథకాలన్నింటిని దేశవ్యాప్తంగా అమలుచేయడానికే బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిందని రవిశంకర్ అన్నారు. సీనియర్ రాజకీయ నాయకుడిగా గౌరవంతో చెపుతున్నానని జీవన్ రెడ్డి మతిభ్రమించి ఏది మాట్లాడినా ఊరుకునేదిలేదని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జెడ్పీ ఛైర్మెన్ దావా వసంత సురేష్, లైబ్రరీ ఛైర్మెన్ డా.చంద్రశేఖర్ గౌడ్, మల్యాల జెడ్పీటీసీ రామ్మోహన్ రావు, పాక్స్ ఛైర్మెన్ సాగర్ రావు, మల్యాల ఏఎంసి ఛైర్మెన్లు నరేందర్ రెడ్డి, జగిత్యాల, బీర్ పూర్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు చెరుకు జాన్, నల్ల మహిపాల్ రెడ్డి, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి వంశీ బాబు, నాయకులు రాజేందర్, అశోక్, కొండగట్టు ఆలయ డైరెక్టర్ సురేష్, నక్కగంగాధర్, నారాయణ, మల్లేశం, కోమురయ్య, గంగిపెళ్ళి శేకర్, సునీల్, ముదిగం రాజేందర్,
నాయకులు తదితరులు పాల్గొన్నారు.