ప్రజాబలం దినపత్రిక -మెదక్ -చిన్న శంకరంపేట మండలం
09-09-2024:
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి చౌరస్తా వద్ద గల శ్రీ రేణుకా మాత వైన్స్ లో గత అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. అది అర్ధరాత్రి సమయం కావడంతో ఎవరూ లేని సమయంలో వైన్స్ షాప్ యొక్క తాళాలు పగలగొట్టి షట్టర్ పైకి లేపి మద్యం షాప్ కౌంటర్ లో నుండి దాదాపుగా 50వేల రూపాయలు నగదు, ఆరు మద్యం ఫుల్ బాటిల్స్,రెండు బీర్లు ఎత్తుకెళ్లినట్టు, షాప్ యజమాని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, ఈ సంఘటనపై విచారణ మొదలు పెట్టిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ లో పరిశీలించగా ఇద్దరు చోర్ కి పాల్పడ్డట్టుగా తెలిసిందని దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు