ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం.

 

9/09/24,చేగుంట ప్రాజబలం న్యూస్ :-

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో ఘనంగా కాళోజి జయంతి ఉత్సవము జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ నీరజ మాట్లాడుతూ, కాళోజి 9.9.1914 లో బీజాపూర్ జిల్లా, రట్టహళ్లి అనే గ్రామంలో జన్మించాడని, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడని, రజాక్లరను ఎదిరించి జైలు జీవితం గడిపాడని, మన యాస మన భాషకు దిక్సూచని, పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది, అన్యాయాన్ని ఎదిరించినవాడు నాకు ఆరాధ్యుడని, అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క లక్ష మెదల్లకు కదలికని, అనే సూక్తుల ద్వారా తెలంగాణ జాతిని చైతన్య పరిచిన దీశాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సురేందర్ రఘుపతి,చల్లా లక్ష్మణ్, రావుల వెంకటేష్,రాధా, సరస్వతి, భవాని, శ్రీ వాణి, రమా రమాదేవి, ఉమాదేవి,శారద, ఉమామహేశ్వరి, రేఖ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking