విద్యుత్ ఘాతంతో పారిశుద్ధ కార్మికుడు మృతి
ప్రజా బలం దినపత్రిక – హవెలి ఘనపూర్ మండల్
09-09-2024:
మెదక్ జిల్లా అవేలి ఘనపూర్ మండలం రాజుపేట గ్రామంలో గ్రామానికి చెందిన దాసరి పోచయ్య,ఉదయం గణేష్ మండపం దగ్గర, మండపాన్ని శుభ్రం చేస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై వెంటనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గణేష్ మండపం వద్ద ఎటువంటి దుర్ఘటన జరగడంతో స్థానికులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు పిర్యాదు చేశారు,సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఈ కేసు పై విచారణ చేపట్టారు.