మానవ అక్రమ రవాణాను అరికట్టాలి

 

ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగ సత్యవతి, హెచ్ఎం నాగూర్ వలీ

ఖమ్మం ప్రతినిధి మార్చి 01 (ప్రజాబలం) ఖమ్మం మానవ అక్రమ రవాణాను అరికట్టాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ రేగళ్ల నాగ సత్యవతి హెచ్ఎం షేక్ నాగూర్ వలీ లు అన్నారు. బుధవారం మధిర మండలంలోని మడుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళల అక్రమ రవాణా పై ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మనుషుల అక్రమ రవాణా హేయమైన చర్య అన్నారు. ప్రపంచంలో డ్రగ్స్‌, ఆయుధాల సరఫరా తరువాత మానవ అక్రమ రవాణా ఆందోళన కలిగిస్తుందన్నారు. స్వలాభం కోసం కొందరు మనుషులను కొనడం, అమ్మడం చేస్తుంటారని మరి కొందరు అవకాశ వాదులు సినిమాలు, టివిల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెబుతూ ఎక్కువగా మధ్యతరగతి మహిళలను, అమ్మాయిలను ఈ ఊబిలోకి లాగుతారన్నారు. మరికొందరు మహిళలు, పిల్లలను కిడ్నాప్‌ చేసి అమ్మకానికి పెట్టడం జరుగుతున్నదన్నారు.. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అదికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి కట్టుగా పనిచేస్తే మనుషుల అక్రమ రవాణాను నివారించవచ్చునన్నారు. అందుకే బాల్యంలోనే మానవ అక్రమ రవాణాపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు లక్ష్మి రాధా మాణిక్యం మేరీ కుమారి శివకుమారి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking