జోగిపేట సీఐ అనిల్ కుమార్
అందోల్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 21, ( ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా, జోగిపేట సర్కిల్ పరిధిలో ఎక్కడైనా కుల మతాల విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పోస్టులు పెట్టిన, కఠిన చర్యలు తప్పవని జోగిపేట సిఐ అనిల్ కుమార్ హెచ్చరించారు, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు, ఈ మధ్యకాలంలో వాట్సాప్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ లలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు వస్తున్న సందర్భంగా సీఐ అనిల్ కుమార్ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, సోషల్ మీడియాపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టిందని, రెండు వర్గాలు గాని,గ్రూపుల మధ్య గాని, కుల మతాల మధ్య గాని, ఇతరుల మనోభావాలు దెబ్బ తినే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన, ఫార్వార్డ్ మెసేజ్లు చేసిన ఉపేక్షించేది లేదని, ఎంతటి వారి కైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు, ఒకరి మత సాంప్రదాయాలను మరొకరు విమర్శించరాదని, మరొకరు గౌరవించినప్పుడే మతసామరాష్ట్యం నెలకొంటుందని కులమతాలకు అతీతంగా వచ్చే పండుగలను జరుపుకోవాలని అన్నారు విద్యార్థి దశలో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అవుతూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు అవుతారన్నా విషయ యువతీ యువకులు దీన్ని దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలని అన్నారు..