విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్ సరిచేయండి

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 21 ఏప్రిల్ 2025
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని క్వార్టర్స్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు ఎర్తింగ్ సరిగా లేనందువలన పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజానీకానికి చిన్న పాటి కరెంట్ షార్ట్ లు కొట్టడం జరిగినదనీ, ఈ మధ్య కాలంలోని వర్షం వల్ల ఇట్టి తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున సంబంధిత విద్యుత్ శక్తి అసిస్టెంట్ ఇంజనీర్ నీ కలసి విషయాన్నీ తెలియ పరుస్తూ వ్రాత పూర్వక వినతి పత్రం అందజేయాగ అట్టి అధికారి సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారం చేయిస్తానని నమ్మబలికాడు, అధికారిని కలసిన వారిలో భాను చందర్, కోడిచెర్ల దేవేందర్, ముత్తంగి లక్ష్మయ్య, అందే లక్ష్మణ్ రావు, సంగం శ్రీకాంత్, బుద్దోలు బాబు, బిట్లుగా రాజు, సుమనళిని, ముత్యాలు తదితరులు కలరు.

Leave A Reply

Your email address will not be published.

Breaking