ఏ.ఎస్.బి.ఎల్ టవర్ నివాసుల ఇబ్బందులు

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 21 ఏప్రియల్ 2025
గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు ఆదివారం రోజున ల్యాంకో హిల్స్ పరిధిలోని ఏ.ఎస్.బి.ఎల్ లేక్ సైడ్ టవర్ అపార్ట్మెంట్ కు వెళ్ళడం దరిమిలా స్థానిక ప్రజల ముఖ్య సమస్యగా ఇరుకు రహదారిలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగే విధముగా సైన్ బోర్డులు పెట్టీ రాక పోకలకు ఇబ్బంది కలిగిస్తున్నారని వాపోయారు, పరిష్కార మార్గంగా ల్యాంకో హిల్స్ నుండి సాయికృప వారు వేసిన లేఔట్ ప్రకారము హై టెన్షన్ వైర్ల క్రింద నుండి పద్మనాభ స్వామి ఆలయం వెళ్ళడానికి అనువుగా ఏర్పాటు చేసిన పాత రహదారి మార్గ సూచికలు ఉన్నను ఫెన్సింగ్ వేసి రహదారి మూసివేయడం జరిగినదని అట్టి ఫెన్సింగ్ తొలగించి ప్రజల సౌకర్యార్థం రహదారి కొనసాగించాలని కోరారు. ఒక వైపు మున్సిపాలిటీ వారు, మరొక వైపు రిజిష్టట్రేషన్ అధికారులు ఒకే ఫ్లాట్ కు ఆస్తి పన్ను ఇద్దరికి కట్టమని వత్తిడి చేస్తున్నారనీ తెలియ జేసినారు. రహదారి వీధి దీపాలు లేనందున నిర్మానుష్యంగా ఉన్న పద్మనాభ స్వామి ఆలయం త్రోవలో రాత్రి కాగానే కొంత మంది మత్తు పానీయాలు సేవించిన తరువాత పెద్దగా అల్లర్లు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కావున పోలీసు పెట్రోలింగ్ చేయించండనీ ప్రాధేయ పడ్డారు. అపార్ట్మెంట్ వెనుక ఉన్న ఖాజాగూడ సరస్సు కొద్ది కొద్దిగా కబ్జాకు గురవుతున్నదనీ చెప్పడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో స్థానికులు కృష్ణ, శ్రీధర్ నాయుడు, ప్రశాంత్, శ్రీధర్, జైరామ్, నరేష్, కోటి రెడ్డి, సురేష్, శ్రీకాంత్, శివ, రాణా, శ్రీనాథ్ రెడ్డి, సిద్దేశ్వర్, రవీందర్, బాలు, రఘు ఉయ్యాల, రమణ రెడ్డి, కృష్ణ, ఆశ, శాంత, విశ్వజిత్, సచిన్ లతో పాటు సీతారాం ధూళిపాళ, గుట్టమీది నరేందర్, అందే లక్ష్మణ్ రావు, ఉపేంద్రనాథ్ రెడ్డి, సంగం శ్రీకాంత్, కోడిచెర్ల దేవేందర్, యాలాల కిరణ్, భాను చందర్, జైరామ్, సుమనళిని, షేక్ ఆరిఫ్, చెరుకూరి బాలాజీ, రమణ మూర్తి, యాలాల బెన్నీ తది తరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking