మంత్రి ఇలాఖ పుల్కల్లో నీటి కష్టాలు

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 21 (ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలోని పుల్కల్ గ్రామంలో గత వారం పది రోజులుగా త్రాగడానికి చుక్క మంచినీరు రాక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వరి పంటపొలాల దగ్గర నుంచి బోరు నీళ్లు తెచ్చుకుని వాడుకుంటున్నారు త్రాగడానికి ప్రైవేట్ వ్యాపారుల దగ్గర పది రూపాయలకు ఒక డబ్బా కొనుగోలు చేసి తెచ్చుకొని త్రాగడం జరుగుతుంది,, మంత్రి దామోదర్ రాజనర్సింహ పుల్కల్ నా సొంత గ్రామం అని ఎన్నికల సమయంలోచెప్పుకుంటారు కానీ సమస్యలు వస్తే పట్టించుకునే నాధుడే లేడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, శనివారం నాడు మహిళలు అందరూ కలిసి రోడ్డు ఎక్కి ఖాళీ బిందెలతో ధర్నా చేశారు, పంచాయతీ కార్యదర్శి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు, శనివారం పుల్కల్ మండలంలో మంత్రి పర్యటన ఉండడంతో, అది గమనించిన కాంగ్రెస్ నాయకులు, పంచాయతీ కార్యదర్శి కలిసి, వాటర్ ట్యాంకర్ ద్వారా ఇంటింటికి నీరు పోయించారు, మంత్రి పర్యటన ఉండడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు, మిషన్ భగీరథ నుండి నీటిని విడుదల చేశారు, వారం పది రోజుల నుండి ప్రజలు నీటిని అడిగితే ఆ పైప్ లైన్ పగిలిపోయింది అని చెప్పారు, ఇప్పుడు ఎలా నీటిని వదిలారు అని పంచాయతీ సెక్రెటరీని చెర వాణి ద్వారా అడిగితే అవును పైప్ లైన్ పగిలిపోయింది అని చెప్పారు నీటిని వదిలారు మంత్రి పర్యటన ఉంటేనే త్రాగడానికి నీటిని ఇస్తారా అంటూ మహిళలు గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఇకనైనా మాకు మంచి నీటి కొరత లేకుండా చూడాలని ప్రజలు అధికార పార్టీ నాయకులను, అధికారులను, కోరుతున్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking