ఈ నెల 15న జిల్లాలో జరిగే టెట్ పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

 

జిల్లా కలెక్టర్ వి పి. గౌతమ్

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 6 (ప్రజాబలం) ఖమ్మం
టెట్ పరీక్షల నిర్వహణ కట్టుదిట్టంగా నిర్వ హించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన అన్నారు. సెప్టెంబర్ 15న ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు రెండవ పేపర్ ఉంటుందని కలెక్టర్ అన్నారు. టెట్ పరీక్షల కోసం జిల్లాలో ఉదయం పరీక్షకు 54, మధ్యాహ్నం పరీక్షకు 45 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు, ఉదయం నిర్వహించే మొదటి పరీక్షకు 12923 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం నిర్వహించే రెండవ పరీక్షకు 10480 మంది అభ్యర్థులు హాజరవ నున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు, పరీక్షా కేంద్రం సమీపంలో జిరాక్స్ షాపులు మూసి వేయనున్నట్లు ఆయన అన్నారు. ప్రశ్న పత్రాల తరలింపు, పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలి పారు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య శిబిరం, త్రాగునీటి సౌకర్యం ఉండే విధంగా ఉండాలని, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, పరీక్షా కేంద్రాల వద్దకు బస్సులు ఏర్పాటు, నిరంతరాయ విద్యు త్ సరఫరా ఉండేలా చూడాలని అధికారు లను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రం ప్రహరి గోడల వద్ద సైతం భద్రత, ఎట్టి పరిస్థితుల్లోనూ పేపర్ లీకేజి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసు కోనున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking