కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలా ఎలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

 

జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ బదావత్ సంతోషం

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 29 : లోక్ సభ ఎన్నికలు 2024 లో భాగంగా జూన్ 4 వ తేదీ న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ కొరకు జిల్లాలోని హాజీపూర్ మండలంలోని ముల్కల్లలో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.బుధవారం హాజిపూర్ మండలంలోని ముల్కల్లలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్, జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు 003 బెల్లంపల్లి ఎస్.సి శాసనసభ నియోజకవర్గం సహాయక రిటర్నింగ్ అధికారి బి రాహుల్ డి.సి.పి.అశోక్ కుమార్,జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సబావత్ మోతిలాల్,మంచిర్యాల రాజవ్వ మండల అధికారి 004 మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం సహాయ రిటర్నింగ్ అధికారి వి.రాములు,ప్రత్యేక ఉప పాలన అధికారి ఎల్.ఎ.ఆర్ & ఆర్,002 చెన్నూర్ ఎస్.సి శాసనసభ నియోజకవర్గం సహాయ రిటర్నింగ్ అధికారి డి. చంద్రకళ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…002 పెద్దపల్లి ఎస్.సి పార్లమెంట్ నియోజకవర్గం ఈ నెల 13 న జరిగిన పోలింగ్ కు సంబంధించి జిల్లాలోని 002 చెన్నూర్ ఎస్.సి,003 బెల్లంపల్లి ఎస్.సి,004 మంచిర్యాల అసెంబ్లీ సిగ్నెట్లకు జూన్ 04 నా ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయడం జరిగిందని, సి.సి కెమెరాల ద్వారా పరీక్షించడం జరుగుతుందని తెలిపారు.కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని, కౌంటింగ్ కేంద్రంలో హాల్లు లు కౌంటర్లు, విద్యుత్ ఇంటర్నెట్, తాగునీరు ఇతరత్రా పూర్తి సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి జూన్ 6 వ తేద వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు బాధ్యతా యుతంగా వ్యవహరించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మేనేజర్ గోపాల్,ఎన్నికల విభాగం అధికారులు,పోలీస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking