తెలుగుజాతి ఇలవేలుపు,తెలుగుజాతి కీర్తి మకుటం, తెలుగునేల ముద్దుబిడ్డ, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు , స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని 100 ఫీట్ రోడ్ లో పద్మ శ్రీ, స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పాల్గొని పూలమాల వేసి ఘన నివాళ్ళుర్పించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర చిరస్థాయిగా వేసుకున్న నాయకుడు, సూర్య చంద్రులు ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన మాహానుభావుడు , విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు ,ఎన్టీఆర్ 101వ జయంతి ని పురస్కరించుకుని జయంతి వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ఎన్టీఆర్ మధుర స్మృతులను కొనియాడారు.