ఇవిఎం స్ట్రాంగ్ రూం ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలి

సాధారణ పరిశీలకులు డాక్టర్ ప్రియాంక శుక్లా

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 29:
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో లో పోలింగ్ ముగిసిన అనంతరం అసెంబ్లీ సెగ్మెంట్ల లలో ఇవిఎం స్ట్రాంగ్ రూం ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని సాధారణ పరిశీలకులు డాక్టర్ ప్రియాంక శుక్లా అన్నారు. సోమవారం ఎన్నికల సాధారణ పరిశీలకులు, జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తో కలిసి హోలీ మేరీ కాలేజీలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ సెగ్మెంట్లు మల్కాజిగిరి,మేడ్చల్, కుత్బుల్లాపూర్ ,కూకట్ పల్లి, ఉప్పల్ ఇవిఎం లను భద్రపరిచేందుకు ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూం లను తనిఖీ చేశారు. అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు చేపట్టి పనులు పూర్తి చేయించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు సలహాలు సూచనలు చేశారు.స్ట్రాంగ్ రూం ల వద్ద నిరంతరం అప్రమత్తంగా వుంటూ, నిఘా ఉంచాలన్నారు. సిసి కెమెరాల ఏర్పాట్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూం చుట్టూ పహారా ఉంచాలన్నారు.
ఈ కార్యక్రమంలో కీసర ఎమ్మార్వో అశోక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking