పథకాలే.. గెలిపిస్తాయి.. ఎంపీ అభ్యర్థి నీలం మధు

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలే తనను గెలిపిస్తాయని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం గజ్వేల్ నియోజకవర్గం కొడకండ్లలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో నీలం మధు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలను గడపగడపకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు సూచించారు. అలాగే అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలన్నారు. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు ముందుకెళ్లి వారిని చైతన్య పర్చాలన్నారు. ఎన్నికలలో గెలిపించేందుకు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని నీలం మధు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking