ఎన్నికల ప్రచారంలో భాగంగా
కొడకండ్లలో ముఖ్యకార్యకర్తల సమావేశం
పథకాలే గెలిపిస్తాయి :నీలం మధుముదిరాజ్
సంగారెడ్డి ఏప్రిల్ 29 ప్రజ బలం ప్రతినిది:
దేశంలో, రాష్ట్రంలో గత పాలకుల అవినీతి అక్రమాలు, మోసాలను ఎండగట్టి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం గజ్వేల్ నియోజకవర్గం కొడకండ్లలో ముఖ్యకార్యకర్తల సమావేశం మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మాట్లాడుతూ.. గత పాలకులు ఎన్నెన్ని దౌర్జన్యాలు, అక్రమాలు చేశారు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. ఆయా వాటిని గడపగడపకు వెళ్లి ప్రజలకు తెలియపరచాలన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రభుత్వ పథకాల గురించి కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఇండియా కూటమి ఏర్పాటయితే రాహుల్ గాంధీ తుక్కుగూడ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నీ నెరవేరుస్తారని,వాటిని కూడా ప్రజలకు వివరించాలన్నారు. ముఖ్యంగా ఎన్నికలలో మోసపూరిత హామీలతో వస్తున్న వారి గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా దేశంలో మళ్ళీ బిజెపి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు వల్ల యువతకు జరిగే నష్టాన్ని వివరించాలని ఈ సందర్భంగా సూచించారు. పేదింటి బిడ్డ అయినా నీలం మదును భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. దుబ్బాక ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట ఇన్చార్జి పూజల హరికృష్ణ, మెదక్ డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ మాజీ పౌసింగ్ కార్పోరేషన్ భూoరెడ్డి , యువజన కాంగ్రెస్ నేత ఆంక్ష, హరికిషన్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.