హైదరాబాద్ జూన్ 16 );వచ్చే ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్టంలో లో 20 % ఉన్న గొల్ల కురుమలకు ఎమ్మెల్యే సిట్లు కేటాయించాలని బత్తుల మల్లేష్ విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు యాదవ హక్కుల పోరాట సమితి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ కలసి చర్చించినట్లు తెలిపారు.గొల్ల కురుమల హక్కుల కోసమై పోరాటం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు గొల్ల కురుమ ల ఓట్ల తో రాజకీయం చేస్తూ గొల్ల కురుమలను రాజకీయంగా అణచివేయాలని కుట్ర పనుతున్నాయని ఆరోపించారు. గొల్ల కురుమలను విస్మరించిన యెడల రాజకీయ పార్టీల అంతు చూస్తామని బత్తుల మల్లేష్ యాదవ్ హెచ్చరించారు. ఈ సమావేశం లోబత్తుల మల్లేష్ యాదవ్,రాందేవ్ యాదవ్ పాల్గొన్నారు