చట్టాలపట్ల అవగాహన పెంచుకొని బాధ్యతగా ముందుకు వెళ్లాలి:రావుల
స్థానిక సంస్థలు, విద్యాఅవకాశాలలో మహిళలకు రిజర్వేషన్ తిడిపి ఘనతే: జ్యోత్స్న
ఘనంగా తెలుగు మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గం ప్రమాణ స్వీకారం
హైదరాబాద్ శుక్రవారం,జూన్ 16(శుక్రవారం ఎన్టీఆర్ భవన్ లో తెలుగు మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుమహిళా రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి అధ్యక్షత వహించారు. ముందుగా పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. ముందు ఇంటిలోని పనులు పూర్తి చేసుకుని తర్వాత పార్టీ కోసం పని చేయాలని ఈ సందర్భంగా మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఎందుకంటే ఇల్లు సరిద్దితే సమాజాన్ని సరిదిద్దినట్లే. ప్రతి ఇంటికి లక్ష్మి మహిళల మనసులలో, మహిళా శక్తి లోనే ఉంది. మహిళల శక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మహిళ లేనిదే ప్రపంచం లేదు. తల్లి, చెల్లి, బిడ్డ, భార్య ఎటు చూసినా మహిళలే. ఎన్టీఆర్కు మహిళల పట్ల ఉన్న గౌరవానికి సంకేతంగా జెండాలో పసుపును తీసుకొచ్చారు. స్తబ్ధతగా ఉన్న టీడీపీని మేల్కొల్పాలంటే మహిళలు ప్రధాన పాత్ర వహించాల్సి ఉంటుందనే ఉద్దేశంతో టీడీపీ చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో మహిళలు కీలక పాత్ర పోషించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు. తెలుగుమహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా పార్టీ కార్యాలయంలో మహిళల కోలాహలం జరుగుతున్నదని బయట మాట్లాడుతుండటం శుభసూచకమని అన్నారు. ఇంకా చాలా మందిని మహిళలను తెలుగుమహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గంలో వేయవలసి ఉందని, రాష్ట్ర పార్టీ కమిటీలో కూడా మహిళలకు ఇంకా అవకాశాలు కల్పించాల్సి ఉందని అన్నారు. తెలుగు మహిళలు ఇచ్చే సలహాలు, సూచనలను రాష్ట్ర పార్టీ పరిగణలోకి తీసుకుంటుందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీని విజయపథంలో నడపడానికి మహిళల పాత్ర ఎంతో కీలమని అన్నారు. తెలుగు మహిళా విభాగం చేపట్టే కార్యక్రమాలలో మీ తమ్ముడిలా, మీ అన్నలా, మీకు అండగా ఉంటామని అన్నారు.
పొలిట్జ్యూరో సభ్యులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… తెలుగు మహిళా విభాగం సమస్యలను అధ్యయనం చేయాలని, చట్టాలపట్ల అవగాహన పెంచుకోవాలని, బాధ్యతగా ముందుకు వెళ్లాలని అన్నారు. బాసర త్రిబుల్ ఐటీలో ఇటీవల జరిగిన రెండు సంఘటనలు అవి స్టూడెంట్స్ సమస్యలతోపాటు మహిళలకు భద్రత కరువైందని తెలుపుతున్నదని అన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకు విశ్వవిద్యాలయాన్ని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని అన్నారు. చంద్రబాబు ఆర్టీసీలో మొదటిసారిగా మహిళలకు కండక్టర్లుగా, డ్రైవర్లుగా అవకాశాలను కల్పించారని అన్నారు. తెలుగు మహిళా శక్తిని బయటి ప్రపంచానికి చాటాలని అన్నారు.
జాతీయ పార్టీ అధికార ప్రతినిధి, టి.జ్యోత్స్న మాట్లాడుతూ… తెలుగు మహిళ అంటే ఏమిటో అందరి చెవులలో మారుమ్రోగేలా సమస్యలపై పని చేయాలని అన్నారు. స్థానిక సంస్థలలో, విద్యాఅవకాశాలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన పార్టీ టీడీపీ అని అన్నారు. పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని అన్నారు. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు. తెలంగాణలో కాసాని జ్ఞానేశ్వర్ ముఖ్యమంత్రి కావడం కొరకు పనిచేద్దామని అన్నారు. తెలుగు మహిళ విభాగానికి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే, కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ.. నేను ఉన్నానని ముందుకు వచ్చి కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ జెండాను రెపరెపలాడిస్తున్నారని అన్నారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో మహిళలు కీలక పాత్ర పోషించే విధంగా కాసాని జ్ఞానేశ్వర్ గారు కార్యక్రమాన్ని రూపొందించారని అన్నారు. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని, రాష్ట్రంలో కాసాని గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని అన్నారు.
రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డి పద్మావతి మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీకి మహిళలు పట్టుకొమ్మలు అని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున తెలుగు మహిళలు ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలను వివరించి ఓట్లు అడగాల్సిన అవసరముందని అన్నారు. రాష్ట్రంలో కాసాని జ్ఞానేశ్వర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అందరం కలిసి పనిచేద్దామని అన్నారు.
రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత మాట్లాడుతూ… చంద్రబాబు గారు ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులో ఇంత మంది మహిళలను చూసేవాళ్లమని ఆ తరువాత ఇప్పుడే చూస్తున్నామని అన్నారు.
రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లీలాపద్మ మాట్లాడుతూ… తెలుగు మహిళ గురించి ఇక ముందు దేశమంతా తెలిసేలా పనిచేద్దామని, మన శక్తి సామర్థ్యాలను నిరూపించుకుందామన్నారు.
తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న మాలాంటి వారు ఇలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తూ పనిచేస్తుంటామని అన్నారు. పార్టీ నుంచి మేము ఏమీ ఆశించడం లేదని.. కష్టపడి పని చేసి మహిళలకు న్యాయం జరిగేవిధంగా పోరాటం చేస్తామని అన్నారు. మహిళలను ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. మహిళల హత్యలు పెరుగుతున్నాయి. మహిళలపై లైంగిక వేధింపులూ ఎక్కువవుతున్నాయి. ఇటువంటి సమస్యలపై తెలుగు మహిళా విభాగం పోరాటం చేసి టీడీపీకి గౌరవం పెరిగేలా పని చేస్తామని అన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కొరకు పోరాటం చేస్తామని అన్నారు. రాష్ట్ర పార్టీ తెలుగు మహిళ విభాగం చేసే పోరాటాలకు అండగా నిలబడాలని కోరారు. మహిళల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు జక్కిలి ఐలయ్య యాదవ్, అజ్మీరా రాజునాయక్, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్, మీడియా వ్యవహారాల కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులు సాయితులసి, సంధ్యపోగు రాజశేఖర్, పార్లమెంట్ పార్టీ అబ్జర్వర్లు పి. సాయిబాబా, అశోక్ కుమార్ గౌడ్, గుళ్లపల్లి ఆనంద్, రాంచందర్రావు పాల్గొన్నారు.
టీటీడీపీ సాంస్కృతిక విభాగం పదవీ ప్రమాణం.
ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. పార్టీ సాంసృ్కతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఇప్పలపల్లి చంద్రహాసన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.