జిల్లా అధికారుల చేతుల మీదుగా ఉత్తమ గ్రహీత అవార్డు అందుకున్న తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్

 

తూప్రాన్, జూన్ 16 (ప్రజా బలం న్యూస్):

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ అభివృద్దే తన ద్యేయంగా పని చేస్తున్న మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ కు అరుదైన పురస్కారం దక్కింది. తెలంగాణ దశబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవ సందర్బంగా మెదక్ జిల్లాలో తూప్రాన్ మున్సిపాలిటీని అన్ని రంగాలలో హంగులతో అభివృద్ధి పథంలో ముందుంచి, తెలంగాణ రాష్ట్రంలోనే తూప్రాన్ మున్సిపాలిటీకి పేరు ప్రఖ్యాతలు రావడానికి కృషి చేసిన మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ మెదక్ జిల్లా ఉత్తమ మున్సిపల్ చైర్మన్ అవార్డును, ఉత్తమ కౌన్సిలర్ లుగా బొంది అరుణ వెంకట్ గౌడ్ ,ఉమ సత్య లింగం ను, కమీషనర్ మోహన్ కు ఉత్తమ అవార్డును మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మెదక్ శాసన సభ్యులు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ చేతుల మీదుగా అవార్డును అందచేశారు. కొత్త కొత్త ఆలోచనలతో వారంలో రెండు రోజులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు, నిరంతరం ప్రజల మధ్యన ఉండి ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టేతత్త్వం ఆయన సొంతం అని వేదికపైన కలెక్టర్ మరియు శాసన సభ్యులు కొనియాడారు. కమిషనర్ మోహన్ కు కౌన్సిలర్లు భైరం ఉమాలింగం, బొంది అరుణ వెంకట్ గౌడ్కు, ఉత్తమ ప్రతిభ అవార్డులను అందచేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking