మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 16 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం అని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ అన్నారు.శుక్రవారం తెలంగాణ దశాబ్ది వేడుకల్లోని పట్టణ ప్రగతి లో కమీషనర్ ఆకుల రాజేందర్ మాట్లాడారు.అనంతరం పట్టణ ప్రగతి అవశ్యకత ను వివరిస్తూ స్థానిక పాత బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అదితిగా స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ దశాబ్ది వేడుకల్లోని పట్టణ ప్రగతి సంక్షేమాన్ని ప్రజలకు చదివి వినిపించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెల కట్టలేమని కొనియాడారు.అంతకు ముందు మున్సిపల్ చైర్మన్ కాంతయ్య మాట్లాడుతూ…పట్టణ ప్రగతి నిధులతో మున్సిపాలిటీ ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు.ముఖ్యంగా సఫయ్ అన్న మీకు సలాం అంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సఫయ్ కార్మికుల గొప్ప తనాన్ని వివరించిందన్నారు.అంతకుముందు వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… ఒకప్పుడు గ్రామ పంచాయతీ గా ఉన్నటువంటి లక్షేట్టిపేట్ మున్సిపాలిటీ గా మారడంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. సఫయ్ కార్మికుల కష్టాలు తొలగిస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరారు. అనంతరం పలు విభాగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని శాలువాతో సన్మానించి, సర్టిఫికెట్స్ అందజేశారు.మహిళ సంఘాలకు మంజురైనా ముప్పై లక్షల చెక్కు ను బ్యాంకు మేనేజర్ తో కలిసి అందజేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉమా కిరణ్,రాజన్న,కోఆప్షన్ ప్రవీణ్, నాయకులు పాదం శ్రీనివాస్,మున్సిపల్ మేనేజర్ శ్రీహరి,సిబ్బంది దినేష్,చరణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking