పెన్షన్‌ స్కీం కాదు చట్టబద్ధమైన హక్కుగా మార్చేందుకు పోరాటం

 

*0.025 శాతం బడ్జెట్తో వికలాంగుల సంక్షేమo ఎట్లా సాధ్యం

*పెన్షన్స్లలో కేంద్ర ప్రభుత్వం వాటా 5000లకు పెంచకుంటే ఉద్యమం

*దివ్యంగులుగా పేరు మార్చడం కాదు వికలాంగుల జీవితాలు మార్చాలి

*మోడీకి పెట్టుబడిదారులపై ఉన్న ప్రేమ వికలాంగులపై ఎందుకు లేదు

*వికలాంగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పార్లమెంట్లొ కేంద్ర ప్రభుత్వంను నిలదీస్తాం

*హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా కదలివచ్చిన వేలాదిమంది వికలాంగులు

*వికలాంగుల సమస్యలు పరిష్కారం చేయకుంటే మోడీని వదిలిపెట్టం

*ఎన్ పి ఆర్ డి మహాదర్నాలో వక్తల హేచ్చరిక

సంగారెడ్డి పిబ్రవరి 10 ప్రజ బలం ప్రతినిధి:
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్స్ స్కీం మాత్రమేనాని డాన్ని చట్టబద్ధమైన హక్కుగా మార్చాలని, వికలాంగులకు పెన్షన్ చట్టబద్దమైన హక్కు సాధన కోసం, కేంద్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ వాటా 300 నుండి 5000 లకు పెంచాలని, ప్రతి వికలాంగునికి అంత్యోదయ రేషన్ కార్డు, ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఇచ్చి 200 రోజులు పని దినాలు కల్పించాలని, 2025-26 కేంద్ర బడ్జెట్లొ 5శాతం నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లొ నిలదీస్తామని వక్తలు హేచ్చరించారు. ఈ రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎన్ పి ఆర్ డి కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది.దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది వికలాంగులు హాజరైనారు.
*ఈ ధర్నాకు హాజరై సిపిఎం రాజ్యసభ సభ్యులు జాన్ బిట్రస్, శివాదాసన్, రహీమ్, డి ఎం కె ఎంపీ తిరుచ్చి శివ,సిపిఐ ఎంపీ వికాస్ రంజాన్ బట్టచర్య, పి సంతోష్ కుమార్ , టీఎంసీ పార్లమెంట్ సభ్యురాలు మౌషన్ నూర్,సమాజ్ వాది పార్టీ ఎంపీ జావెద్ అలీఖాన్,ఇండియన్ ముస్లిం లీగ్ ఎంపీ హరీష్ బిరెన్, పార్లమెంట్ సభ్యులు అజిత్ కుమార్ గోయాంక్, ఎన్ పి ఆర్ డి జాతీయ అధ్యక్షులు గిరీష్ కీర్తి, ప్రధాన కార్యదర్శి మురళీధరన్, వర్కింగ్ ప్రెసిడెంట్ నంబు రాజన్, ఉపాధ్యక్షులు యం అడివయ్య, మాజీ జాతీయ అధ్యక్షులు క్రాంతి గంగూలీ తదితరులు మాట్లాడినారు.
*ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2.68 కోట్ల మంది వికలాంగులున్నారని కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే WHO లెక్కల ప్రకారం 16 శాతం మంది వికలాంగులు ఉన్నారని అన్నారు కానీ వికలాంగుల జనాభాను గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శలు చేశారు .2012 నుండి పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా కేవలం 300 రూపాయలు మాత్రమే చేల్లిస్తుందని, దీనితో వికలాంగులు ఎట్లా బ్రతుకుతురని ప్రశ్నించారు. నిత్యావసర సరకుల ధరలు 300 రేట్లు పెంచిన మోడీకి వికలాంగుల పెన్షన్స్ పెంచాలానే ఆలోచన ఎందుకు రావడం లేదన్నారు. ధరల పెరుగుదల సూచికి పెన్షన్స్ అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇందిరా గాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ పథకాన్ని వికలాంగులందరికి వర్తింప చేయకుండా 3.8శాతం మంది వికలాంగులకే ఎందుకు ఇస్తున్నారని అన్నారు.రాజస్థాన్ రాష్ట్రం మాదిరిగా పెన్షన్ పొందడం వికలాంగుల హక్కుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు.2015డిసెంబర్ 3న అర్బటంగా ప్రధాన మంత్రి ప్రారంభించిన సుగమ్య భరత్ అభియాన్ పథకం అమలుకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు నిధులు బడ్జెట్లొ ఎందుకు కేటాయించలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అసమర్ధత వలన 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, 2017మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్,2007 ఐక్య రాజ్యా సమితి హక్కుల ఒప్పంద పత్రం,నేషనల్ పాలసీ, నేషనల్ ట్రస్ట్ వంటి కీలక చట్టాలు అమలు చేయకుండా వాటిని నిర్వీర్యం చేయడానికి మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేసి వికలాంగులకు అమలు అవుతున్న రిజర్వేషన్స్ రద్దు చేయాలని చూస్తున్నారని అన్నారు.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించి భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.2025-26 కేంద్ర బడ్జెట్లొ వికలాంగులకు మొండి చెయ్యి చూపినరాని
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లొ వికలాంగుల సంక్షేమనికి 0.025 శాతం కేటాయించడం ఎంత వరకు సమంజసం అన్నారు. మోడీ పాలనలో కేటాయించిన నిధుల్లో 2020-21లొ 64శాతం, 2021-22లొ 86శాతం, 2022-23లొ 79 శాతం, 2023-24 లొ 93 శాతం విడుదల చేయకుండా వికలాంగుల గురించి మాట్లాడే హక్కు మోడీ ప్రభుత్వంకు ఎక్కడిదాని అన్నారు.వికలాంగుల కోసం అమలావుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపిందని అన్నారు. స్కీం ఫర్ ది ఇంప్లిమెంటేషను ఆఫ్ పర్సన్ విత్ డిజేబుల్స్ యాక్ట్ పథకానికి కేటాయింపులు మరింత తగ్గించడం ఆందోళన కల్గిస్తున్నదని అన్నారు. 2022-23లొ 250.39 కోట్లు, 2024-25లొ 135.33 కోట్లు కేటాయిస్తే 2025-26 బడ్జెట్లొ 115.10 కోట్లకు తగ్గించరని అన్నారు.గత బడ్జెట్లొ వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలకు 758.01 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్ లొ 741.80కోట్లకుతగ్గించారు.మానసిక వికలాంగుల కోసం అమలవుతున్న తెలిమెంటల్ హెల్త్ పోగ్రామ్ కోసం గత బడ్జెట్ లొ 90కోట్లు కేటాయిస్తే 2025-26 బడ్జెట్ లొ 79.60 కోట్లకు తగ్గించారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సులను విస్మరించరని అన్నారు.,ఇందిరా గాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ పథకం (IGNDPS)కు కేటాయింపులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిరకరించిందని ప్రశ్నించరు వికలాంగుల జనాభాలో కేవలం 3.8 శాతం మంది వికలాంగులకే వర్తించే ఇందిరా గాంధీ నేషనల్ డిసబుల్డ్ పెన్షన్ స్కీం పథకంను వికలాంగులందరికి వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ వాటా 300 రూపాయలను 5000లకు పెంచాలని .పెన్షన్ పొందడం చట్టభద్ధమైన హక్కుగా సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.రాజస్థాన్ రాష్ట్రంచేసిన మాదిరిగా పెన్షన్ పొందడం వికలాంగుల హక్కుగా, కేంద్ర ప్రభుత్వంకూడా పెన్షన్ పొందడం వికలాంగుల హక్కుగా చట్టాన్ని చేయాలని . ప్రతి ఏటా 15 శాతం పెన్షన్ పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్ చేశారు.ఉపాధి హామీ పథకంలో వికలాంగులు చేయడానికి అనువుగా ఉన్న పనులను గుర్తించి పని కల్పించాలి. దరఖాస్తూ చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇచ్చి 200 రోజులు పని కల్పించాలని అన్నారు.వివాహంతో సంబంధం లేకుండా వికలాంగులకు అంత్యోదయ అన్న యోజన కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.అన్ని రకాల రైలులలో వికలాంగుల ప్రయాణ రాయితీ సౌకర్యాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులు రాయితీలను పొండెందుకు UDID కార్డునే గుర్తింపుగా పరిగణించాలని అన్నరు.వికలాంగుల విద్యా అభివృద్ధి కోసం తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల మాదిరిగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విద్యా పాలసి చేయాలని డిమాండ్ చేశారు సకలాంగుల క్రీడాకారులతో సమానంగా వికలాంగుల క్రీడాకారులను ప్రోత్సహించాలి. పారా క్రీడాలను అభివృద్ధి చేయాలని కోరారు.నామినేటెడ్ పదవుల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
2016 ఆర్ పి డి చట్టంతో పాటు ఇతర వికలాంగుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని,2016 ఆర్ పి డి చట్టం చీఫ్ కమిషనర్, నేషనల్ ట్రస్ట్కు చైర్మన్ లను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ కల్పించేందుకు చట్టం చేయాలని డిమాండ్ చేశారు.వికలాంగులపై వేధింపులు అరికట్టెందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు.సాబ్ కే సాత్, సాబ్ కా వికాస్ అంటున్న మోడీకి వికలాంగుల వికాస్ కన్పించడం లేదా అని ప్రశ్నించారు. వికలాంగులలొ 80శాతం మంది పేదరికంలొ ఉన్నారని అన్నరు. పేదల కోసం ఉన్నామని గొప్పలు చెప్పే మోడీకి వికలాంగులు కన్పించడం లేదా అని ప్రశ్నించారు.వికలాంగుల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టకుండా ఉన్నా పథకాలను రద్దు చేయడానికి కుట్రలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామ అని ప్రశ్నించారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటూ వికలాంగుల ఆత్మ నిర్భర్ భరత్ గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు.కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సమస్యలు పరిష్కారం చేయకుంటే పార్లమెంట్లొ ప్రభుత్వంను నిలదీస్తామని అన్నారు. హక్కుల సాధన కోసం వికలాంగులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలొ ఎన్ పి ఆర్ డి జాతీయ ఉపాధ్యక్షలు జాన్సీ రని,శ్యామ్య గంగూలీ,కోశాధికారి చక్రవర్తి, సహాయ కార్యదర్శి రిషికేష్, కేంద్ర కమిటీ సభ్యులు కే వెంకట్, ఆర్ వెంకటేష్,జె రాజులతో పాటు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి స్వామి, అరిఫా, ఉపేందర్, కాషాప్ప, సహాయ కార్యదర్శులు దశరథ్, బాలేశ్వర్, గంగాధర్,రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking