• పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించి, కేసుల పెండెన్సీ లేకుండా చూడాలి..
స్టేషన్ రికార్డ్ లపై పూర్తి అవగాహన కలిగి, ఫిర్యాదు మొదలుకొని చార్జ్ షీట్ వరకు స్పష్టమైన డ్రాఫ్ట్టింగ్ ఉండాలి
…. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్
సంగారెడ్డి పిబ్రవరి 10 ప్రజ బలం ప్రతినిధి:
జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టేషన్ రైటర్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ.. స్టేషన్ రైటర్స్ కొరతను అదిగమించడానికి జిల్లాలో కొత్తగా నియామకమైన పోలీస్ కానిస్టేబుల్స్ కు 3-రోజుల శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సిబ్బంది ప్రతి ఒక్కరు స్టేషన్ రికార్డుల గురించి తెలుసుకొని, పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ప్రతి రికార్డ్, హిస్టరీ షీట్స్ అప్డేట్ చేస్తూ పెండింగ్ లేకుండా చూడాలన్నారు.
స్టేషన్ రైటర్స్ గా పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా యస్.హెచ్.ఓ లకు సహకరించాలి, నేరం జరిగినట్లు ఫిర్యాదు అందుకున్న వెంటనే క్రైమ్ సీన్ కు చేరుకొని, నేరస్థలాన్ని ప్రొటెక్ట్ చేసి, నేరస్థల పోటోగ్రఫీ తీయించాలని అన్నారు. ఫిర్యాదు మొదలుకొని చార్జ్ షీట్ వరకు ప్రతి విషయాన్ని వివరంగా డ్రాఫ్ట్ చేస్తూ ఎదుటివారికి త్వరగా అర్ధమయ్యేలా సింపుల్ పదజాలాన్ని వాడాలని అన్నారు. చిన్న కేసులలో వారం రోజుల లోపు చార్జ్ షీట్ దాఖలు చేసేవిధంగా స్పీడ్ వర్క్ చేయాలని సూచించారు. నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరుగుతుందని అన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు.ఎస్పీ ఎ.సంజీవ రావ్, డిటిసి డియస్పి సురేందర్ రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, నార్కోటిక్ ఇన్స్పెక్టర్ కిరణ్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, ట్రైనీ ఎస్ఐలు, సిబ్బంది తదితరులు ఉన్నారు.