ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్
పిబ్రవరి 10 :
మందమర్రి ఏరియాలోని కేకే 5 గనిలో పిట్టర్ గా విధులు నిర్వహాస్తున్న జనార్ధన్ సోమవారం అస్వస్థతకు గురై రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్ లో చేరారు. విషయం తెలుసుకున్న
మన ఐ ఎన్ యు సి
సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు ఐ ఎన్ టి సి నాయకులు
ఆర్ కె పి హాస్పిటల్ కు వెళ్లి జనార్దన్ ని పరామర్శించి మెరుగైన వైద్యం
అందించాలని డిప్యుటి మెడికల్ సూపరింటెండెంట్ ప్రసన్న కుమార్ తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి కేంద్ర కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాంపెల్లి సమ్మయ్య, కేంద్ర కమిటీ జనరల్ సెక్రెటరీ ఏనుగు రవీందర్ రెడ్డి, కేంద్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంఘ బుచ్చయ్య, కేంద్ర కమిటీ నాయకులు మేకల రాజయ్య, నాయకులు నాగరాజ్, కాండే రాజ్ కుమార్ లు
పాల్గొన్నారు.