-అదివాసి నాయక్ పోడ్ హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు గంజి రాజన్న
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 19:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వివిధ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 5 లక్షల మంది యువతకి ఉపాధి కల్పన కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించి గిరిజన కార్పొరేషన్ మరియు ఐటిడిఎ ద్వార గిరిజన నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పన కోసం ఈ నెల 17. నుండి ఏప్రిల్ 5వ తేది వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదివాసీ నాయిక పొడ్ హక్కుల పరిక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు గంజి రాజన్న పిలుపునిచ్చారు. ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆధార్ కార్డు, కులం సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, పాస్ ఫోటో, సెల్ ఫోన్ నెంబర్
జతపరచి దగ్గరలోని మీ సేవా కేంద్రం లేదా ఇంటర్నెట్ సెంటర్లలో అప్లయ్ చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయికపోడ్ సేవా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు లౌడం రాజ్ కుమార్, జిల్లా సీనియర్ నాయకులు పాలమాకుల భీమ్సేన్, మందమర్రి మండల ప్రధాన కార్యదర్శి పల్లె పృథ్విరాజ్ లు పాల్గొన్నారు.