వినయ్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి

 

-విచారణ పేరుతో బూతులు తిట్టిన రైల్వే ఎస్.ఐ

-కేసును మందమర్రి స్టేషన్ కు బదిలీ చేయాలి

-మీడియా ముందు గోడు చెప్పుకున్న వినయ్ సతీమణి భాగ్యలక్ష్మి

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 19:

మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన నస్పూరి వినయ్ ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన నేపథ్యంలో తన భర్త మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుని భార్య భాగ్యలక్ష్మి మందమర్రి ప్రెస్ క్లబ్ లో కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తన భర్త ఆత్మహత్య చేసుకోవడానికి వోడ్నల శ్రీనివాస్, అతని భార్య ఒడ్నాల మమత లు ప్రేరేపించారని తెలిపింది. తన భర్తను మమత తన వలలో వేసుకోని తతంగం నడిపించిందని దానికి సంబంధించిన ఫోటోలను మీడియా ముందు ప్రదర్శించింది. వోడ్నల శ్రీనివాస్ అతని మిత్రులు నరేందర్, సురేందర్ రాజిరెడ్డి అనే వ్యక్తులు పలుమార్లు వినయ్ పై దాడి చేసినట్లు తెలిపింది. దాంతో వినయ్ మానసికంగా తీవ్ర ఆవేదన చెందినట్లు ఈ నేపథ్యంలో పలుమార్లు వినయ్ ఆత్మహత్యయత్నం చేసుకున్నట్లు తెలిపింది. వేధింపులు ఆగకపోవడంతో గతనెల వినయ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన మృతి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మందమర్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. మంచిర్యాల రైల్వే పోలీస్ స్టేషన్ లో సైతం ఫిర్యాదు చేయగా విచారణ పేరిట రైల్వే ఎస్ ఐ సాక్షులను ఇష్టం వచ్చినట్లు తిట్టినట్లు భాగ్యలక్ష్మి వాపోయింది.రైల్వే పోలీసుల తీరు పై అనుమానం వ్యక్తం చేస్తూ రైల్వే పోలీస్ స్టేషన్ నుండి ఈ కేసును మందమర్రికి బదిలీ చేయాలనీ కోరింది. తనకు న్యాయం జరగకుంటే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని మృతుని భార్య భాగ్యలక్ష్మి తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking