కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
అగ్రహారం సమీపంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ పరిశీలన
వేములవాడ, మార్చి -19
(ప్రజాబలం నియోజకవర్గం ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సరఫరాలో ఆటంకాలు ఉండకుండా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బుధవారం అగ్రహారం సమీపంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్, నీటి శుద్ధి, సరఫరా, ల్యాబ్ ను పరిశీలించారు. నీటిని శుద్ధి చేసే ప్రక్రియను క్షుణ్ణంగా కలెక్టర్ కు మిషన్ భగీరథ ఇంజనీర్లు వివరించారు. పంపింగ్ సామర్థ్యం, స్టోరేజి వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రస్తుత వేసవి ఉన్నందున ప్రతి ఇంటికి నల్ల నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోజు నీటి శుద్ధి కేంద్రాల నుండి నీరు సరఫరా జరిగేలా మిషన్ భగీరథ ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలన్నారు. రోజూ రెండు సార్లు జిల్లాలోని OHSR లను మిషన్ భగీరథ గ్రిడ్ ఇంజనీర్ నింపాలన్నారు. నీటి నాణ్యతను ప్రతి రోజూ నాలుగు సార్లు పరిశీలించాలని సూచించారు. జిల్లాలో ఏఏ గ్రామాలకు త్రాగునీరు వెళ్లడం లేదు. పూర్తిగా తెలుసుకోవాలన్నారు. త్రాగునీరు వెళ్లని గ్రామాలకు.మిషన్ భగీరథ నీరు వెళ్లేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.తనిఖీలో మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్ కార్య నిర్వాహక ఇంజనీరులు జానకి, శేఖర్ రెడ్డి, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.