30 సంవత్సరాల పోరాటంతో ఎస్సీ వర్గీకరణ

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ముందు కృష్ణ చిత్ర పత్రపటానికి క్షీరాభిషేకం

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 19 : మంచిర్యాల జిల్లా కేంద్రంలో వర్గీకరణ సంబరాలు గత 30 సంవత్సరాలుగా ఎస్సీల వర్గీకరణ కోసం అనేక పోరాటాలు చేస్తూ అనేక అవమానాలు ఎదుర్కొంటూ మాదిగ జాతికి దక్కాల్సిన న్యాయమైన హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేసి ఈరోజు వర్గీకరణ సాధించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చెన్నూరు సమ్మయ్య మాదిగ మాట్లాడుతూ…ఎస్సీ లలో అనేక అసమానతలు గత డెబ్బై సంవత్సరాలుగా మాదిగలు అనేక ఇబ్బందులు పడుతూ దక్కాల్సిన వాటా దక్కకుండా అనేక సందర్భాల్లో తమ ఆవేదనను చెప్పుకోనికి సరైన నాయకుడు లేక చింతిస్తున్న సందర్భంలో 70 ఏళ్ల అన్యాయానికి 30 ఏళ్ల పోరాటం తోడై నేడు మూడు గ్రూపుల వర్గీకరణ సాధించడం జరిగింది.మూడు అక్షరాల మాదిగ అనే పదానికి మంద కృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాటం చేసి తీరా వర్గీకరణ సాధించుకోవడం జరిగింది.ఈ వర్గీకరణ పూర్తిగా మంద కృష్ణ మాదిగ పోరాట ఫలితమే అని మాదిగ జాతి మనస్ఫూర్తిగా విశ్వసిస్తుంది అంతేగాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మాదిగలకు దక్కాల్సిన వాటాను కుదించి మాయలకు న్యాయం చేకూర్చే విధంగా ఈ వర్గీకరణ చేయడం జరిగింది భవిష్యత్తులో తమ తప్పుని సరిదిద్దుకొని మాదిగలకు రావాల్సిన రిజర్వేషన్ కోటాను పెంచి న్యాయం చేయాలని కోరడం జరిగింది వర్గీకరణ వచ్చిన సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంద కృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణాసంచా కాల్చుకొని ఒకరికొకరు రంగులు పూసుకోవడం జరిగింది ఇది అనేక ఒడిదుడుకుల మధ్య అనేక అసమానతల మధ్య మాదిగ జాతికి దక్కిన విజయంగానే మేము చూస్తున్నామని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీ జిల్లా అధ్యక్షులు చెన్నూరు సమ్మయ్య మాదిగ,ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు చెన్నూరు శ్రీనివాస్ మాదిగ చిప్పకుర్తి మల్లేష్ మాదిగ చిప్పకుర్తి వెంకన్న మాదిగ జలంపల్లి శ్రీనివాస్ మాదిగ చిప్పకుర్తి సతీష్ మాదిగ గుడిసెల దశరథ మాదిగ చుంచు శంకర్ వర్మ మాదిగ మోతే పోషన్న మాదిగ నక్క అంజన్న మాదిగ జీలకర్ర శంకర్ మాదిగ జిడి సారంగం మాదిగ ఎలకటూరి వేణు మాదిగ ఎలుకటూరి రాజేష్ మాదిగ మంతెన నవీన్ మాదిగ ముల్కల నరేష్ మాదిగ చిప్పకుర్తి నారాయణ మాదిగ అవునూరి ప్రసాద్ మాదిగ రామగిరి రామ్ మాదిగ శివకుమార్ మాదిగ జంపన్న మాదిగ పెళ్లి సుగుణాకర్ మాదిగ చెన్నూర్ విష్ణు మాదిగ పిడుగురాళ్ల అరుణ్ మాదిగ బొడ్డు రవీందర్ మాదిగ రాజలింగ మాదిగ.

Leave A Reply

Your email address will not be published.

Breaking