లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ
తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్ లో చలి వెంద్రం ప్రారంభం
బ్లూ స్టార్ వాటర్ కుమార్ ద్వార ఫిల్టర్ వాటర్ ఏర్పాటు*
జీపీపీ డిపో మేనేజర్ పవన్.
గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్, మార్చి, 19. ప్రజాబలం ప్రతినిధి :-
సుదూర ప్రాంతాల ఆర్టీసీ ప్రయాణికుల దాహార్తి తీర్చడమే లక్ష్యంగా తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్ లో లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ ఏర్పాటు చేసిన తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్ లో చలి వెంద్రం ను మున్సిపల్ తాజా మాజీ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కౌన్సిలర్ పల్లేర్ల రవీందర్ గుప్తతో కలిసి బుధవారం ఉదయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభంచారు. ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ పావన్ మాట్లాడుతూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశానుసారం బ్లూ స్టార్ వాటర్ కులర్ ద్వార ఫిల్టర్ వాటర్ ఏర్పాటు ప్రయానికుల దాహార్తి తీర్చడమే లక్ష్యంగా చలివేద్రం ను తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ సహకారంతో ప్రారంభించినట్లు జీపీపీ డిపో మేనేజర్ పవన్ తెలిపారు. అనంతరం డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ డాక్టర్ జానకిరామ్ మాట్లాడుతూ మండుటెండలో సుదూర ప్రాంతాలైన అదిలాబాద్, ఉట్నూర్, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, బోధన్ తదితర ప్రాంతాలనుంచే గాకుండా అటు సంగారెడ్డి, జహిరాబాద్, నర్సాపూర్, ఇటు గజ్వేల్, భోనగిరి, యాదగిరి గుట్ట తదితర ప్రాంతాల నుంచి ప్రతినిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల దాహార్తి తీర్చడం కోసం తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్ లో గత పది సంవత్సరాలుగా వేసవి కాలంలో బ్లూ స్టార్ వాటర్ కూలర్ ద్వార చల్లటి నీరు అందించడం ఒక గొప్ప పుణ్య కార్యం అని అన్నారు. లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ సౌజన్యంతో తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చలి వేంద్రమ్ ఏర్పాటు చేయడం స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రయాణికుల అవసరానికి అనుగుణంగా కుల్ కూల్ చల్లటి త్రాగు నీరు అందించడం ప్రదీప్ సింహ పూర్వజన్మ సుకృతం అని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూప్రాన్ మున్సిపల్ తాజా మాజీ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కౌన్సిలర్, డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ పల్లేర్ల రవీందర్ గుప్త లు హాజరై ప్రారంభించడం విశేషం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ డాక్టర్ జానకిరామ్, లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ, లయన్ డాక్టర్ అఫ్సర్, డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ పల్లేర్ల రవీందర్ గుప్త, మున్సిపల్ వైస్ చైర్మన్ లయన్ నందాల శ్రీనివాస్, గజ్వేల్ – ప్రజ్ఞాపుర్ ఆర్టీసీ డిపో మేనేజర్ పావన్, తూప్రాన్ బస్టాండ్ ఇన్చార్జి చంద్రకళ, కంట్రోలర్ గున్నాల రాములు గౌడ్, ఎపురి రాజు భయ్య, గెంట్యాల నాగరాజు, తాటి వెంకటేష్, స్వర్గం వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.