సి.ఈ.ఆర్ క్లబ్ లో క్వార్టర్ ల కోసం కౌన్సెలింగ్

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 19:

మందమర్రి ఏరియాలోని సి.ఈ.ఆర్ క్లబ్ లో బుధవారం సింగరేణి ఎన్.సి. డబ్ల్యు.ఏ ఉద్యోగులకు క్వాటర్స్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్ కు మందమర్రి మరియు శ్రీరాంపూర్ ఏరియాలకు 93 క్వాటర్స్ ప్రకటించగా,54 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా, సీనియార్టీ ప్రకారం 21 మంది ఎన్.సి.డబ్ల్యూ.ఎ మందమర్రి మరియు శ్రీరాంపూర్ ఏరియా ఉద్యోగులకు పారదర్శకంగా క్వార్టర్స్ కేటాయించడం జరిగిందని పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యామ్ సుందర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఓ.టు జి.ఎం విజయ్ ప్రసాద్, డీ.జీ.ఎం ఐ.ఇ.డి రాజన్న, డి.వై.పి.ఎం మైత్రేయ బంధు, రాజలింగు (ఒ.ఎస్) పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking