లక్కీడ్రా పద్దతిన బెస్ట్అబుల్ పాఠశాలల విద్యార్థుల ఎంపిక

జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సబావత్ మోతిలాల్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 11 : 2024-25 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశాలకు అర్హత గల షెడ్యూల్ కులముల విద్యార్థిని, విద్యార్థులను లక్కీడ్రా పద్దతిన ఎంపిక చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ సబావత్ మోతిలాల్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు పోటు రవీందర్ రెడ్డి కలిసి అభ్యర్థుల తల్లిదండ్రుల సమక్షంలో లక్కీడ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో 1,5 తరగతిలో ప్రవేశం కొరకు విద్యార్థిని విద్యార్థులకు అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు.1వ తరగతిలో ప్రదేశం కొరకు 154 మంది విద్యార్థి విద్యార్థులు దరఖాస్తు చేస్తుకోగా లక్కీడ్రా పద్ధతిన సజావుగా 92 మందిని ఎంపిక చేయడం జరిగిందని, ఇందులో బాలికల విభాగంలో 30 మంది బాలికలు,జనరల్ విభాగంలో 61 మంది బాలికలు, అనాధ విభాగంలో 1 ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.5 వ తరగతిలో 160 మంది దరఖాస్తు చేసుకోగా 91 మందిని ఎంపిక చేయడం జరిగిందని, ఇందులో బాలికల విభాగంలో 29 మంది జనరల్ విభాగంలో 61 మంది అనాధ విభాగంలో 1 ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థినీ, విద్యార్థులు ప్రభుత్వం కల్పించిన ఆకాశాన్ని చేసుకొని విద్యాలయంలో రాణించాలని, ఉన్నత స్థాయిలో నిలిచేలా క్రమశిక్షణ,ఏకగ్రతతో చదువుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ సాంఘిక సంక్షేమ అధికారి ఎం రవీందర్,సంబంధిత అధికారులు,విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking