ఐద్వా జిల్లా కార్యదర్శి కోనేటి నాగమణి.
కరీంనగర్ ప్రజా బలం ప్రతినిధి మే 11
ఈరోజు స్థానిక కోతి రాంపూర్ లోని ముకుంద లాల్ మిశ్రా భవన్ లో జిల్లా కమిటీ సమావేశం సిహెచ్ .రోజా అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి మాట్లాడుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు కరీంనగర్ పట్టణంలో నిర్వహించడం శుభ పరిణామం అని, రాష్ట్ర కమిటీ కరీంనగర్ జిల్లాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.మహిళల పట్ల రోజు రోజుకు అఘైత్యాలు,లైంగిక వేధింపులు,వరకట్న వేధింపులు పెరుగుతున్నాయని ప్రభుత్వాలు కొత్తగా కఠిన చట్టాలను రూపొందించడంలోను,ఉన్న చట్టాలను అమలు చేయడంలో విఫలం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనలు జరిగినప్పుడే తూ,తూ మంత్రంగా పర్యటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించాలని అన్నారు. ఐద్వా నిరంతరం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కృషి చేస్తుందని,ఆర్థిక, సామాజికంగా,రాజకీయంగా మహిళలు ఉన్నత స్థితికి చేరుకునే విధంగా రాష్ట్ర స్థాయి క్లాసులను కరీంనగర్ జిల్లాలో నిర్వహించి, మహిళా సమస్యలను చర్చించి రానున్న రోజుల్లో మహిళా సమస్యల పట్ల మరింత ఉదృత పోరాటాల నిర్వహించడానికి రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు కరీంనగర్ లో నిర్వహిస్తున్నామని జిల్లావ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషులు, సానుభూతిపరులు,వ్యాపార వర్గాలు ప్రజలు సహకరించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో కే. స్వరూప,దేవేంద్ర,రోజారాణి, తదితరులు పాల్గొన్నారు.