ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..రోడ్డు ప్రమాదంలో ఆత్మీయ అభిమాని మృతి చెందడం చాలా బాధాకరమని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు అన్నారు. మామడ మండలం పులిమడుగు గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఆనంద్ రావు సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామంలో మంగళవారం నిర్వహించిన అంత్యక్రియలకు శ్రీహరి రావు హాజరయ్యారు. పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటానని భరోసానిచ్చారు