కిష్టాపూర్ పాఠశాలలో విద్యార్థుల స్వయం పరిపాలన దినోత్సవం.

విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు పట్లూరి లక్ష్మణ్.

మెదక్ తూప్రాన్ మార్చ్ 5 ప్రజాబలం న్యూస్:-

మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని యుపిఎస్ కిష్టాపూర్ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా జయంతి, డీఈఓగా సందీప్, ఎంపిడిఓగా అక్షిత, యంఈఓగా గణేష్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గా రాంచరణ్, ఉపాధ్యాయులుగా జ్యోష్న, ప్రవళిక, నవ్య, తులసి, గౌతమ్, శ్రీప్రియ, పిఈటిగా అఖిల్ సాయి, అటెండర్ గా హర్షవర్ధన్, లను నియమించారు. వీరికి ఏర్పాటుచేసిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ చూసిన చూపరులను ఆకర్షించారు.
అనంతరం ప్రధానోపాధ్యాయులు పట్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరు తమ విధిని ఎలా బాధ్యతగా నిర్వర్తించాలో నేర్చుకుంటారని ఈ వృత్తి యొక్క గొప్పతనం ఈ కార్యక్రమం ద్వారా వారికి అర్థమవుతుందని తెలిపారు. విద్యార్థులు తమలోని నైపుణ్యాలను చక్కగా ప్రదర్శించారని అభినందించారు.
ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పట్లూరి లక్ష్మణ్, ఉపాధ్యాయులు అనురాధ, విజయ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking