జోనల్ క్రీడాల్లో హుజురాబాద్ గురుకుల విద్యార్థులు ప్రతిభ

హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి నవంబర్ 18

కరీంనగర్ మెదక్ సిరిసిల్ల జిల్లాల పరిధిలో 10 జోనల్ క్రీడల్లో హుజురాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల క్రీడాకారులు సత్తా చాటారు. మెదక్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల స్కూలు ఈ నెల 11 నుండి 14 వరకు 43 గురుకులుకు చెందిన 1100 మంది విద్యార్థినిలు కోకో, కబడ్డీ, షాట్ పుట్ టెన్నికైట్ నిర్వహించారు. ఈ క్రీడలలో హుజురాబాద్ గురుకుల క్రీడాకారులు 100 మీటర్లు 200 మీటర్ల రన్నింగ్, డిస్కస్ త్రో లో మొదటి స్థానం అండర్ 14 కబడ్డీలో మొదటి స్థానం అండర్ 14 వాలీబాల్ రెండవ స్థానం, ఓవరాల్ చాంపియన్షిప్ హుజురాబాద్ విద్యార్థులు మొదటి విజేతలుగా ప్రభంజనం సృష్టించారు. కళాశాల ప్రిన్సిపత్రి ఇందిరా, పీడీ, పీఈటిలు స్వరూప, నిరోషా పాల్గొన్నారు. అత్యంత ప్రతిభ కనబరించిన హుజురాబాద్ గురుకుల విద్యార్థినీలను ప్రత్యేకంగా అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking