ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ నవంబర్ 18 : పర్యావరణానికి జరిగే హాని ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపై రైతులకు అవగాహన కార్యక్రమం ఉత్కూరు వరి కొనుగోలు కేంద్రంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఆర్ శ్రీకాంత్ నిర్వహించడం జరిగింది.సోమవారం ఈసందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ… రైతులకు పంట అవశేషాలను కాల్చడం ద్వారా నేల యొక్క సారవంతం దెబ్బ తినడమే కాకుండా వాయు కాలుష్యం మరియు శ్వాస కోస వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలియజేయడం జరిగింది కావున రైతులు సాధ్యమైనంత వరకు పంట అవశేషాలను నేలలో కలియదున్ని ఎస్ ఎస్ పి వాడడం ద్వారా త్వరగా త్వరగా కుళ్లిపోయి తద్వారా పోషకాలు మొక్కలకు అందే అవకాశం కలుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీనిక, రైతులు,యూత్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రాందేని చిన్న వెంకటేష్ పాల్గొనడం జరిగింది.