గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:సోమవారంనాడు ప్రజావాణి కార్యక్రమం సందర్బంగా గోషామహల్ నియోజకవర్గం లోని గంఫౌండ్రిడివిజన్ , జాంబాగ్ డివిజన్‌లలో ఆదాయం ను పెంచుకొనే మార్గలకు సంబంధించిన వినతిపత్రం సమర్పించడం జరిగింది.1.ఈసమియా బజార్లో డంప్ యార్డ్ ను తొలగించాలి.2.నియోజకవర్గం లో పాడయినా స్ట్రీట్ లైట్స్ ను మార్చాలి.3.సుల్తాన్ బజార్ క్లాక్ టవర్ వద్ద ఫుట్ పాత్ ను ఆక్రమించుకున్న వారిని తొలగించాలి. 4.పాడయినా రోడ్లను బాగుపర్చాలి. 5.టాక్స్ విభాగం, టౌన్ ప్లానింగ్ లో వున్న అవినీతి కీ పాల్పడుతున్న వారిని తొలగించాలని వినతిపత్రం లో కోరడమైనది. ఈ కార్యాక్రమంలో బద్దం సతీష్ గౌడ్ కన్వినర్ గోషామహల్ నియోజకవర్గం డెవలప్మెంట్ ఫోరమ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాధా కృష్ణ, అశోక్, నరేందర్,లోహిత్, చెందు గౌడ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.