విద్యార్థులకు విద్యతో పాటు మానసిక ప్రశాంతతకు క్రీడలు, సైన్స్ ఫెయిర్ లు తోడ్పడుతాయని పురానాపూల్ కార్పోరేటర్ సున్నం రాజ్ కుమార్ అన్నారు.బుధవారం నాడు పురానాపూల్ లోని ఎస్వీ నగర్ లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల అప్జల్ గంజ్ లో జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా సైన్స్ ఫెయిర్ నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి సైన్స్ ఫెయిర్ లు తోడ్పడుతాయని తెలిపారు.బహదూర్ పుర మండలం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మహ్మద్ ముఖ్రమ్ మాట్లాడుతూ పదవతరగతి లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీమతి పి.ఎల్.పద్మజాకుమారి, సైన్స్ ఉపాధ్యాయులు శ్రీమతి సుచరిత, బల్వంత్ రెడ్డి, తెలుగు పండితులు డాక్టర్. ఎస్. విజయ భాస్కర్., ఉపాధ్యాయులు ప్రద్యుమ్న రెడ్డి, అశోక్ బాబు, కౌసర్ ఫాతిమా,బబిత, శ్రీనివాస్, బహదూర్ పుర మండలం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ క్యాంపు క్లర్క్ మహ్మద్ ముఖ్తధర్, జూనియర్ అసిస్టెంట్ సయ్యద్ మోహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.విద్యార్థంలు ప్రదర్శించిన సైన్స్ ప్రయోగాలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయి.