ఇల్లందకుంట సీతారాముల దేవాలయానికి స్వయంగా పొన్నం ప్రభాకర్ ఎంతగానో సేవ చేశారు.
ఎంపీ బండి సంజయ్ మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
దళిత బంధు విషయంలో అపోహలు వద్దు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు
బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు ఎందుకు అందించలేదు.
నియోజకవర్గ లోని కాంగ్రెస్ కమిటీలు అన్ని రద్దు.
త్వరలోనే కొత్త కమిటీలు.
హుజురాబాద్ ఫిబ్రవరి28
మంగళవారం సిఎం రేవంత్ రెడ్డి చేవెళ్ల వేదికగా మరో రెండు పథకాలు ప్రారంభించడం సంతోషకరమని
500 గ్యాస్,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలు ప్రారంభించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హుజూరాబాద్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు
మాటిస్తే ఇస్తే మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని
అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే 4 పథకాలు అమలు చేసాము.రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటిలను అమలు చేసే భాధ్యత మాది.ఇందిరమ్మ కమిటీలను త్వరలోనే ప్రకటిస్తాము, పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందజేసే భాధ్యత కమిటీలు చూసుకుంటాయని అన్నారు
దళిత బంధు విషయంపై అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారు.ఆనాడు ఉప ఎన్నిక సమయంలో ఓట్ల కోసమే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని దళిత బంధు
పథకం ప్రకటించిన తరువాత రెండో విడుత ఇవ్వడంలో ఎందుకు జాప్యత చేశారనిపూర్తి స్థాయిలో వాటిని ఇవ్వకుండా దళితులను మోసం చేశారు
గత రెండేళ్లలో దళితులకు రెండో విదుత ఏందుకు ఇవ్వలేదు.ఇవ్వడానికి ఎవరు అడ్డుకున్నారు.ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో రెండవ విడత ఇవ్వడానికి ఏం అడ్డువచ్చింది. అని ప్రణవ్ నిలదీశారు.
దళిత బంధు లబ్ధిదారులు ధైర్యంగా ఉండండి.మీ అకౌంట్ లో వేసిన డబ్బులు పోవు,డబ్బులు వాపస్ తీసుకోవడం జరగదు,ప్రభుత్వం మారిన కూడా డబ్బులు తీసుకొము.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదు భవిష్యత్ లో ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిది.గత రెండేళ్లుగా నియోజకవర్గ పరిధిలో ఇరిగేషన్ శాఖ పట్ల మీరు ఏం చేశారు. నియోజకవర్గ పరిధిలోఉన్న డిబియెం 15 లో ఏలాంటి పనులు చేయలేదు.కల్వల ప్రాజెక్ట్ కొట్టుకపోయినప్పుడు అసెంబ్లీ సాక్షిగా తెలిపారు.దానిపట్ల మీకు చిత్తశుద్ధి లేదు. దాని మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయలేదు.

భూ దందాల విషయంలో,ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం చేసే వారిని ఉరుకునే ప్రసక్తేలేదు.భూ బకాసురాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. హుజురాబాద్ లో భూ దందాల విషయంలో ఇప్పడికే ఫిర్యాదు చేశాము.
ఎన్నికలు సమీపిస్తున్నప్పుడే ఇక్కడున్న ఎంపీ కి దేవుళ్ళు గుర్తుకు వస్తారు.దేవుళ్ళను రాజకీయాల్లోకి లాగకండి.
రాష్ట్ర మంత్రి పొన్నం పై చేసిన అనుచిత వ్యాఖ్యలను బేశరుతుగా వాపస్ తీసుకోవాలి,క్షమాపణ చెప్పాలి.వ్యక్తిగత రాజకీయాలు మంచిది కాదు.రాజకీయాల్లో హుందాగా ప్రవర్తించాలి.
హుజురాబాద్ ప్రజలకు ఎంపీ గా ఏం నిధులుతీసుకువచ్చారో తెలిపాలి.ఎంపీ పరిధిలో ఉన్న పనులు కూడా పూర్తి చేయలేదు.రైల్వే అధికారులతో మాట్లాడి కమాలపూర్ ఉప్పల్ రైల్వే వంతెన ఎందుకు పూర్తి చేయలేదు.రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేస్తాం.
హుజూరాబాద్ నియోజకవర్గంలో గతంలో ఉన్న కాంగ్రెస్ కమిటీ లు అన్నీ రద్దు చేసాము .త్వరలో కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని మీడియా సమావేశంలో ప్రణవ్ చెప్పారు ఈ సమావేశంలో
పి.సి.సి.మెంబర్ పత్తి కృష్ణా రెడ్డి, సొల్లు బాబు,ఎర్ర రమేష్ గూడపు సారంగపాణి,కోలిపాక శంకర్,పూదరి రేణుక,
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తిప్పరపు
సంపత్,సుంకరి రమేష్,సజ్జూ, విష్ణు దాసు గోపాల్ రావు పొన్నగంటి మల్లన్న, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు..