-దర్జాగాలేని దర్జీల బ్రతుకులు
-రెడీమేడ్ దుస్తుల రాకతో టైలర్లకు కష్టాలు
వాకులాభరణం కృష్ణమోహన్ రావు.
హుజరాబాద్ ప్రజా బలం ప్రతినిధి ఫిబ్రవరి 28
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే సామాజిక, ఆర్థిక ,కుల సర్వేతో బలహీన వర్గాల జీవితాలలో మంచి రోజులు వస్తాయి అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. పేద వర్గాల సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించే దిశగా, ప్రభుత్వం ‘కుల గణన’తో ముందుకు రావడం గొప్ప నిర్ణయం అనిఅన్నారు బుధవారం నగరంలోని కొత్తపేట లో గల బాబూ జగజ్జీవన్ రాం భవన్ లో, తెలంగాణ మేరు సంఘం ఆధ్వర్యంలో జరిగిన “ప్రపంచ టైలర్స్ డే ” వేడుకలను ఘనంగా నిర్వహించారు .తొలుత సర్ ఇ విలియమ్స్ హోవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ లు పాల్గొని ప్రసంగించారు.సభాధ్యక్షులుగా తాళ్ళ వెంకట్రావు వ్యవహరించారు.మేరు సంఘం,రాష్ట్ర ప్రతినిధులు కొవ్వూరు భాస్కరరావు,పొడిశెట్టి నరసింగరావు,అడపా వెంకటేశ్వరరావు ,దీకొండ నరసింగరావు,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకటేష్ , బాబా చంద్రపాల్, సంగేవార్,రావి పాపన్న,రావి పాపన్న,కీర్తిశేఖర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డాక్టర్ వకుళభరణం ప్రసంగిస్తూ కుట్టుమిషన్ కనిపెట్టిన సర్ ఇ విలియమ్స్ స్మారకార్ధం ప్రపంచ టైలర్స్ దినోత్సవం జరుపుకోవడం సముచితంగా ఉందన్నారు .రాష్ట్రంలోని దర్జీ కులస్తుల సమస్యల ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు .సమస్యల పరిష్కారం దిశగా తమ వంతు సహకారం అందిస్తానని అన్నారు.
సభలో విశిష్ట అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు ఎం అనిల్ కుమార్ మాట్లాడుతూ …ఎల్లవేళలా ప్రజలు అందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు . బీసీ వర్గాలలో ఆయా కులాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తన దృష్టికి తీసుకువస్తే ,ప్రభుత్వానికి నివేదించి, సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన దర్జీ వృత్తిదారులు, మేరు కులస్తులు పాల్గొన్నారు.
Prev Post