అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 6 ( ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా: అందోల్ నియోజకవర్గం లోని అల్లాదుర్గం మండల కేంద్రంలో బుధవారం (కేజీబివి)జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను, మండల ప్రత్యేక అధికారి కరుణాకర్, పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు, ఆయా పాఠశాలల పరిసరాలను కరుణాకర్,పరిశీలించి, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండే వంటగదిని, భోజనం వండే కూరగాయలను, పరిశీలించారు, ఈ సందర్భంగా (ఎం ఈ ఓ,) కరుణాకర్, మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యతలేని భోజనం పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందజేయాలని, ఆదేశించారు,( కేజీబివి )జూనియర్ కళాశాలను సందర్శించి, నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని పరిశీలించారు, ఈ కార్యక్రమంలో( ఎంపీడీవో) చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు..