అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి కష్టంతో ఇష్టపడి చదవాలి.
విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.
ప్రజాబలం ప్రతినిధి
తేది.2.5.2025.
ములుగు జిల్లా.
రాష్ట్రంలో విద్య వైద్యాన్ని అనుకున్న స్థాయిలో అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులు విద్యతో పాటు సంస్కారం నేర్చుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
ప్రతి వ్యక్తి అనుకున్న లక్ష్యాలను ఛేదించడానికి కష్టంతో ఇష్టపడి విద్యను అభసించాలని అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఇంటర్మీడియట్, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించడంతో గిరిజన విద్యార్థుల అభినందన సభ ఐ టి డి పి ఓ చిత్ర మిశ్రా అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో రాష్ట్రంలోనే ములుగు
జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని, పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఎనిమిదవ స్థానంలో నిలవడం సంతోషకరమైన విషయమైనప్పటికీ రానున్న పరీక్షలలో విద్యార్థినీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని కోరారు. ఉన్నత చదువులు చదివిన విద్యార్థిని, విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందినప్పటికీ గిరిజన ప్రాంతాలలో నిరక్షరాస్యత రూపొందించి అక్షరాస్యత పెంపొందించడానికి కృషి చేయాలని అన్నారు. పట్టుదలతో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. రానున్న విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రాష్ట్రంలో విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం
కృత నిశ్చయంతో ఉందని తెలిపారు. విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు సైతం తాము సాధించే విద్యను ఎంచుకోవాలని, ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థిని, విద్యార్థులను ప్రోత్సహించడమే కాకుండా వారికి ప్రత్యేకంగా స్కాలర్షిప్ లు అందిస్తున్నామని వివరించారు.
ఎంత చదివినా విద్యార్థిని విద్యార్థులు ఆత్మగౌరవం, ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలని, ప్రతి విద్యార్థి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని విద్యని అభ్యసించాలని మంత్రి అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తప్ప దారి పట్టకుండా ప్రతి విద్యార్థి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని విద్యను అభ్యసించాలని, జిల్లాలో గిరిజన గిరిజన ప్రాంతాలలో విద్యను బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకునే ముందు పోతున్నామని తెలిపారు. చదువుకు ఎప్పటికీ ముగింపు ఉండదని దానికి నిదర్శనమే ప్రస్తుత మంత్రి సీతక్క
డబుల్ పి హెచ్ డి చేయడం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జీవితంలో పదిమందికి ఉపయోగపడేలా ప్రతి విద్యార్థి పనిచేయాలని, తాను సైతం పేదరికం నుండే వచ్చి నేడు కలెక్టర్ గా కొనసాగుతున్నానని వివరించారు. రానున్న భావితరాలకు ఆదర్శంగా నిలిచే విధంగా విద్యార్థులు నిలవాలని కోరారు.
ముందుగా జిల్లాలోని తాడ్వాయి, జగ్గన్నపేట ఆశ్రమ జూనియర్ కళాశాలలో 22 మంది లెక్చరర్స్ కు గత మూడు సంవత్సరాల నుండి వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్న దృశ్య మంత్రి ప్రత్యేక చొరవ చూపి పెండింగ్ జీతాన్ని ఇప్పించినందుకు గాను కృతజ్ఞతగా మంత్రి సీతక్కను లెక్చర్లు సన్మానించారు.
అనంతరం జిల్లాలోని ఆశ్రమ పాఠశాల హాస్టల్ లలో విద్యనభ్యసించి 541 మార్కులు పొంది టాపర్లుగా నిలిచిన 12 విద్యార్థిని విద్యార్థులకు మంత్రి శాలువాతో సన్మానించారు.
ఐటీడీఏ పరిధిలో డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీమ్ లో భాగంగా దరఖాస్తు చేసుకున్న 9 మంది గిరిజన యువతకు డ్రైవింగ్ ట్రైనింగ్ ఇచ్చి లైట్ మోటార్ వెహికల్ లెర్నింగ్ లైసెన్స్ మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్,
ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ వీరభద్రం,
డి డి పోచం, ఎస్ ఓ రాజ్ కుమార్,
సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, లెక్చర్లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.