👉 పట్టించుకోని అధికారులు
అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మే 2 (ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం పరిధిలో గల పోచారం నుండి జాతీయ రహదారి 161 సంగుపేట్ ఎక్స్ రోడ్ వరకు రోడ్డు పనులను ఆర్ అండ్ బి అధికారులు కాంట్రాక్టర్కు అప్పగించారు సదురు కాంట్రాక్టర్ రోడ్డుపైన కంకర వేసి వదిలేశాడుఇప్పటికి నాలుగు ఐదు నెలలుగడుస్తున్నా రోడ్డుపైన డాంబర్ వేయకుండా,వదిలివేయడంతో ఈ రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే జంకుతున్నారు ఎందుకంటే ప్రతినిత్యము ఈ రోడ్డుపై నుండి యస్, ఇటిక్యాల, శివారులో గల ఎమ్మెస్ స్పిరిట్ కంపెనీ యొక్క భారీ లిక్కర్ వాహనాలు అలాగే ముదిమాణిక్యం గ్రామానికి చెందిన భారీ లోడుతో ఉన్న శుద్ధ లారీలు వెళ్లడంతో వాటి వెనకాల రోడ్డుపైన ఉన్నటువంటి కంకర డస్ట్ లేవడంతో ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు అది కళ్ళల్లో పడి వాహన చోదకులు గాయాలపాలై ఆసుపత్రులకు డబ్బులు వెచ్చించుకుంటున్నారు సదురు కాంట్రాక్టర్ను ప్రజాబలం పత్రిక రిపోర్టర్ చరవాణిలో మాట్లాడితే ఇప్పుడువస్తాం అప్పుడు వస్తామంటూ మాట దాటి వేస్తున్నారు కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డు పైన డాంబర్ వేయించ గలరని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు……