గవర్నర్‌ ని కలిసి ధన్యవాదాలు తెలిపిన తెలంగాణా కాంగ్రెస్‌ బీసీ నాయకులు

స్వతంత్ర భారతావనిలో కుల గణన నిర్వహించిన మొదటి రాష్ట్రం తెలంగాణ.
టీపిసిసి అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌
ఖైరతాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి: ఏప్రిల్‌ 8 న బీసీ లకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఉభయసభల్లో చేసిన బిల్లుకు
గవర్నర్‌ ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపడంతో గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ కి ధన్యవాదాలు తెలంగాణ కాంగ్రెస్‌ బీసీ నేతలు పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు , కేశవరావు , మధుయాష్కి గౌడ్‌, అంజన్‌ కుమార్‌ యాదవ్‌ , రాజ్యసభ సభ్యులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ ,ఎమ్మెల్సీ విజయశాంతి తో మరియు ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు , కార్పొరేషన్‌ చైర్మన్‌ లు ,ఇతర ముఖ్య నేతలతో కలిసి ధన్యవాదాలు తెలపడం జరిగింది
టీపిసిసి అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ
స్వతంత్ర భారతావనిలో కుల గణన నిర్వహించిన మొదటి రాష్ట్రం తెలంగాణ.
సిఎం రేవంత్‌ రెడ్డి సారథ్యంలో కామారెడ్డి డిక్లరేషన్‌ అనుగునంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్ట బద్దత కల్పించాం

               
తెలంగాణ ప్రభుత్వం బీసీ లకు రాజకీయ, విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఉభయ సభల్లో చేసిన బిల్లుకు ఏప్రిల్‌ 8 న గవర్నర్‌ ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపడంతో తెలంగాణ బీసీ మంత్రులు, నేతలతో కలిసి గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ కి ధన్యవాదాలు తెల్పడం జరిగింది
కులగణన క్రెడిట్‌ రాహుల్‌ గాంధీ గారిదే
కేంద్రం జనగణన తో పాటు కులగణన నిర్ణయం రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ ప్రభుత్వ విజయం
తెలంగాణ మోడల్‌ ను కేంద్రంలోని బీజేపీ అనిఅసరిస్తోంది
కుల గణన పై కేంద్రం నిర్ణయం తో రాహుల్‌ ఆశయం నెరవేరింది
రాహుల్‌ గాంధీ ఆశయం మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి,మంత్రుల బృందం కుల గణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించింది
మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం దేశానికి రోల్‌ మోడల్‌ గా బీసీ లకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు చట్టం చేసింది
చట్టం కన్నా ముందు ఎంపెరికల్‌ డేటా ప్రామాణికమైన సమాచారాన్ని సేకరించి సబ్‌ కమిటీ వేసి కేబినెట్‌ అప్రూవల్‌ తీసుకొని శాసనసభ ఆమోదించుకొని చట్టాన్ని ప్రభుత్వానికి అనుమతి కొరకు కేంద్రానికి పంపే సందర్భంలో గవర్నర్‌ న్యాయ పరమైన అంశాలను పరిశీలించి రాష్ట్రపతికి పంపడం జరిగింది
అందుకు తెలంగాణ కాంగ్రెస
బీసీ నాయకులం గవర్నర్‌ ని కలిసి ధన్యవాదాలు తెలపడం జరిగింది
తెలంగాణ లో తీసుకున్న కుల గణన రోల్‌ మోడల్‌ దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం 2025 జన గణన లో కుల గణన చేస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం
దీనిపై విమర్శిస్తున్నారు ఆత్మవిమర్శ చేసుకోవాలి
గతంలో వ్యతిరేకించిన వారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకత్వం గా తీసుకుంటే జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారు..
దేశ వ్యాప్తంగా బలహీన వర్గాల సంక్షేమానికి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
గవర్నర్‌ కి ధన్యవాదాలు తెలుపుతున్న..
దేశ వ్యాప్తంగా కుల గణన చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన ఆధారంగా బీసీ లకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్టాన్ని అమలు చేయడానికి ఆమోదించాలి.. కేంద్ర ప్రభుత్వం బీసీ ల చిత్తశుద్ధి నిరూపించుకోవాలి..

Leave A Reply

Your email address will not be published.

Breaking