రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 2 మే 2025.
వీధి వ్యాపారుల చట్టంతో తై బజార్ పేరిట అక్రమార్జనకు చెక్.
2014 లో కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు చట్టబద్ధత మరియు బ్రతుకు దెరువు భద్రత కల్పించాలన్న సదుద్దేశంతో పార్లమెంట్లో చట్టం చేసి అన్ని రాష్ట్రాలకు చట్టాన్ని అమలు చేయాలని సూచించిన నేపథ్యంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016 లో వీధి వ్యాపారులకు చట్టబద్ధత స్కీమ్ ను విడుదల చేసి దాన్ని అమలు చేయాలని తగు సూచనలు చేస్తూ 2020 జూన్ నెల 10 వ తేదీన జీవో నంబర్ 89 కూడా జారీ చేయడం జరిగింది. చట్టాన్ని అమలు పరచాల్సిన అధికారులు, అనధికారులతో కుమ్మక్కై చట్టానికి తూట్లు పొడిచి చట్టబద్ధత లేని తాయి బజార్ పేరిట ఇష్టం వచ్చిన రీతిలో జవాబు దారీ తనం లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఇట్టి కార్యక్రమంను అదుపులో పెట్టమని, చట్టబద్ధత గల వీధి వ్యాపారులకు అన్యాయం జరుగకుండా బ్రతుకు దెరువు భద్రత కల్పించాలనీ ది సిటిజన్స్ కౌన్సిల్ మణికొండ వారు గత కొద్దిరోజులుగా లేవనెత్తుతున్న వీధి వ్యాపారుల చట్టం విషయమై పలుమార్లు మణికొండ మున్సిపల్ కమిషనర్ ను, సి.డి.ఎం.ఏ మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రాలు సమర్పించడం జరిగినను అట్టి వినతి పత్రాలన్ని తుంగలో త్రొక్కి పట్టించు కోకుండా ముందుకు సాగడం అధికారుల నిర్లక్ష్యానికి ప్రతికగా భావించాలి.

వీధి వ్యాపారుల చట్టంతో ఊరట – బలవంతపు వసూళ్ళు బంద్.
ఏప్రిల్ 3 రోజున మణికొండ మున్సిపల్ కమిషనర్ తై బజార్ కి టెండర్ జారీ చేయడాన్ని పేపర్ ప్రకటన గావించిన వెను వెంటనే 4 ఏప్రియల్ రోజున తై బజార్ కి ముగింపు పలికి వీధి వ్యాపారుల చట్టం అమలు చేయాలని ది సిటిజన్స్ కౌన్సిల్ సంస్థ మణికొండ తరపున మున్సిపల్ కమిషనర్, సి.డి.ఎం.ఏ మరియు జిల్లా కలెక్టర్ లకు అర్జీ పెట్టుకోవడం, అది కాస్తా వృధా ప్రయాసగ పరిణితి చెందడం ప్రత్యాయముగ అడ్వకేట్ ద్వారా నోటీసులు జారీ చేయడం అట్టి లీగల్ నోటీస్ లకి కూడా స్పందించని కారణంగా ది సిటిజన్స్ కౌన్సిల్ తరపున గౌరవ హైకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 11108/2025 దాఖలు చేయడం జరిగింది. గౌరవ హైకోర్టులో దాకలు చేసిన రిట్ పిటిషన్ కి రాష్ట్ర ప్రభుత్వ మునిసిపల్ శాఖ అధికారుల తరపున కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా తాయిబజార్ వేలం పాట కొనసాగించి 61,30,000/- గాను నిర్ణయించి అందులో సగభాగం వసూలు చేయడం జరిగినదనీ సమాచారం కానీ గౌరవ హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్న దరిమిలా వేలం పాట హక్కుదారునికి ముందుకు సాగడానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వకుండా మణికొండ మునిసిపల్ అధికారులు నిమ్మకుండా ఉండడం అంత డబ్బు పెట్టుబడి పెట్టిన వారీ పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉన్న చందాన వారి ప్రతి చర్య ఎలాగ కొనసాగుతుందో వేచి చూడాల్సిందేనని మరియు మునిసిపల్ అధికారులు అటు గౌరవ హైకోర్టుకు కావాలని సమయ పాలన గావిస్తూ మూడు వారాలుగా నాన్చుతూ, జవాబు చెప్పవలసిన తీవ్ర వత్తిడి దృష్ట్యా అవసరాన్ని అనుసరించి గత్యంతరం లేని పరిస్థితిలో వీధి వ్యాపార చట్టాన్ని అమలు చేయాలని, అది కూడా కేవలం మణికొండ కే కాకుండా సంపూర్ణ తెలంగాణాలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ తో పాటు అన్ని అర్బన్ మున్సిపల్ కౌన్సిల్ తది తరులందరికీ వర్తించేలాగా మునిసిపల్ అధికారులు మార్గదర్శకాలను సూచిస్తూ ఏప్రియల్ 26 రోజున ఒక సర్క్యులర్ నంబర్ 798291/MEPMA – SUSV/Gen/2/2025 జారీ చేయడం జరిగింది.
తై బజార్ కథ మణికొండలో ముగిసిన ముచ్చట.
ఇక మీదట వీధి వ్యాపారుల పేరిట రోడ్లపై డబ్బాలు పెట్టి అద్దెకు ఇవ్వడం నేరం మరియు అక్రమంగా డబ్బాలకు అనుమతి ఇచ్చి వారి దగ్గర డబ్బులు వసూలు చేయడం అంతకన్నా పెద్ద నేరం అని ఇప్పటికైనా అధికారులు స్పందించి పైన తెలిపిన ఉత్తర్వులను అనుసరించి వెను వెంటనే మణికొండలో వీధి వ్యాపారుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ది సిటిజన్స్ కౌన్సిల్ కోరుతున్నది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని అమలు చేయకుండా తై బజార్ పేరిట అక్రమార్జనను ప్రోత్సహించి నందుకు సి.బి.ఐ ని కూడా రానున్న రోజులలో విచారించమని కోరడ మవుతుందనీ ది సిటిజన్స్ కౌన్సిల్ కమిటీ సభ్యులు సీతారాం ధూళిపాళ, అందె లక్ష్మణ్ రావు, షేక్ ఆరీఫ్ మొహమ్మద్, ఉపేందర్నాధ్ రెడ్డి, దిలీప్ కక్కడ్, రామసుబ్బా రెడ్డి, సాగర్, బొడ్డు శ్రీధర్ లు తెలియ జేసినారు.