రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 2 మే 2025
గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ మునిసిపాలిటీ నాయకులు 2 మే రోజున పుప్పాలగూడలోని సెక్రటేరియట్ కాలనీ, తిరుమల హిల్స్ పరిసర ప్రాంత ప్రజలను కలుసుకొని స్థానిక సమస్యల సేకరణలో భాగంగా: సెక్రటేరియట్ కాలనీ రోడ్డు నంబర్ 10 ప్రక్క నుండి పారే పందెంవాగు నాలపై కొంత మేర మాత్రమే డోమ్ రూపంలో సిమెంట్ కట్టడం జరిగినదనీ విస్తు పోతున్నారు. ఇట్టి డోమ్ కట్టడం పందెంవాగు నాలపై పూర్తిగా వేసినట్లయియితే ప్రజలకు ఎంతో కొంత మేలుచేసిన వారౌతారని తద్వారా స్థానికులు దుర్వాసన పాలు కాకుండా ఆరోగ్యాలతో విరాజిల్లు తారని తెలియ చేసినారు. ఇదే రోడ్డులో ఉన్న ఖాళీ స్థలం మొత్తంగా కుప్పి తొట్టి మాదిరిగా చెత్తా చెదరంతో ఉండడం వలన దోమల బెడద తీవ్రంగా ఎదుర్కుంటున్నామని వాపోయారు. ప్రజా ప్రోయోగార్థం మంచినీటి సరఫరా సమయ పాలన లేకుండా లైన్ మెన్ ల ఇష్టారాజ్యంగా వేళా పాలా లేకుండా అరగంట సేపు సరఫరా చేస్తున్నట్లు, బోరింగులలో నీటిమట్టం లేనందువలన ప్రజలు ఇక్కట్ల పాలౌతున్నామని తమ అభిప్రాయాన్ని వ్యక్త పరచారు. ఇట్టి పరిస్థితిలో ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని అల్లాడి పోతున్నారు. తిరుమల హిల్స్ మొత్తంగా విద్యుత్ సరఫరా సరిగా లేదని పై పెచ్చు రోడ్డు నంబర్ 14 చివరలో వీధి దీపాలు అసలు వెలగడం లేవని చిమ్మ చీకటిలో బయటకు రావడానికి స్థానికులు జంకుతున్నారని తెలిపినారు. తిరుమల హిల్స్ రోడ్డులు మొత్తం కుప్పితోట్టోల మాదిరి ఎక్కడ బడితే అక్కడ చెత్తా చెదారంతో విరాజిల్లుతున్నదని తెలిపినారు. ఇట్టి రోడ్డు చివరలో కాలువనుండి దుర్గంధంతో పాటు విష నాగులు వస్తున్నావని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవితం గడుపుతున్నామని బయ బ్రాంతులతో తెలిపినారు. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సాధ్యమైనంత త్వరగా ఉపశమనం కలిగించాలని బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు సీతారం ధూళిపాళ, గుట్టమీది నరేందర్, అందే లక్ష్మణ్ రావు, సంఘం శ్రీకాంత్, బుద్ధోలు బాబు, బండమీది మల్లేష్, దిలీప్, బిట్లుగ రాజు, శ్రీనివాస్ చారి, రాజేంద్ర ప్రసాద్, సుమనళిని, యాలాల కిరణ్ డిమాండ్ చేస్తున్నారు.
