మెదక్ మార్చ్ 28 ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం నాడు జరిగాయి ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ జరిగాయి 85 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రభాకర్, సాయికుమార్, లక్ష్మణ్ గౌడ్, మంజుల ప్రకటించారు. కే సుభాష్ చంద్ర గౌడ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా ఆకుల శ్రీనివాస్, జె శ్రీపతిరావు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా , ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పరశురాములు గౌడ్ , గ్రంధాలయ కార్యదర్శిగా బోంతుల అశ్విని కుమార్, చిరంజీవి, రమేష్ నాయక్, శారద, బేగ్ లను ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు సంయుక్త కార్యదర్శిగా దొమ్మాట దుర్గారెడ్డి, క్రీడలు సాంస్కృత కార్యదర్శిగా కావేటి మధు కిరణ్ , గ్రంధాలయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులను సీనియర్ న్యాయవాదులు అభినందించారు. అనంతరం సీనియర్ న్యాయవాది పోచయ్యను న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. అనంత అనంతరం సీనియర్ న్యాయవాది పోచయ్య మాట్లాడుతూ న్యాయవాదులంతా కలిసిమెలిసి ఉండి , మన హక్కులను సాధించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.