రాజీవ్ యువ వికాసం పథకం సద్వినియోగం చేసుకోండి

 

– మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి

అందోల్ నియోజకవర్గ ప్రతినిధి మార్చి 21 ( ప్రజాబలం) కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కోసం హర్హులు అందరూ దరఖాస్తు చేసుకోవాలని రైకోడ్ మునిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, సుధాకర్ రెడ్డి తెలిపారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు,రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వం ఈనెల 17 నుండి దరఖాస్తులనుస్వీకరిస్తుందని తెలిపారు, కేటగిరి -1 కింద రూ , లక్ష వరకు రుణం అందించి, 80% రాయితీ ఇస్తుందని, క్యాటగిరి -2 కింద రు, లక్ష నుంచి రూ ,2, లక్షల వరకు రుణాలను మంజూరు చేసి 70% రాయితీ కల్పిస్తుందని, కేటగిరి-3 కింద రూ , 2, లక్షల నుండి రూ ,3, లక్షల వరకు రుణాలను అందజేసి 60% రాయితీ ఇవ్వనుందని తెలిపారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న, ఈ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, యువత అర్హులైన వారందరూ వచ్చేనెల ఏప్రిల్ 5,వ తారీకు వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking