ఏడుపాయల దేవస్థానం అభివృద్ధికి చొరవ చూపండి

– తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి పత్రాని అందజేసిన
మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్

మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గభవాని దేవస్థానం ను సుందరీకరణగా తీర్చిదిద్దడమే కాకుండా తెలంగాణకే తలమానికంగా ఏడుపాయల దేవస్థానం అభివృద్ధికి చొరవ చూపాలని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ శనివారం అసెంబ్లీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి పత్రాని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ మెదక్ జిల్లాను తెలంగాణ రాష్ర్టంలో నెంబర్ 1 జిల్లాగా తీర్చిదిద్దడమే ముఖ్య ఉద్ధేశ్యం అని ఆయన తెలిపారు. ఏడుపాయల వన దుర్గమాతను తెలంగాణ రాష్ర్టమే కాకుండా చుట్టూ ప్రక్కల ఉన్న మహారాష్ర్ట, కర్ణాటక నుండి భారీగా భక్తులు తరలివస్తుంటారని, వారికి తాత్కాలికంగా మౌలిక వసతులు కాకుండా పర్మనెంట్ గా వసతులు కల్పించేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించానని ఆయన పేర్కోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking